ఐపీఎల్ 2021లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకు పరిమితమైంది ముంబయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (7) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. తర్వాత డికాక్, సూర్య కుమార్ కాసేపు వికెట్‌ను కాపాడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 29 పరుగులు జోడించాక డికాక్ (19)ను ఔట్ చేశాడు అక్షర్ పటేల్. సౌరభ్ తివారి (15), పొలార్డ్ (6), హార్దిక్ (17) పరుగులు సాధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల ముంబయి బ్యాట్స్‌మెన్ పరుగులు తీయడంలో విఫలమయ్యారు. దీంతో 129 పరుగులకు పరిమితమైంది రోహిత్‌సేన.