కరోనా ప్రభావం ఉన్నా సరే ఐపీఎల్ ఘనంగా ప్రారంభమైంది. చెన్నైలో శుక్రవారం తొలి పోరు జరగ్గా, శనివారం నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ మైదానంలో మ్యాచ్‌లు లైవ్‌గా చూసేందుకు వచ్చే అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులకు బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల 10 మంది అధికారులకు పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ కోసం వచ్చే అధికారులు, కొవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలి. నెగటివ్ ఉంటేనే లోపలికి వారిని అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఈ సీజన్లో భాగంగా వాంఖడేలో, ఏప్రిల్ 10 నుంచి 25 వరకు మొత్తం 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం తొలి పోరులో చెన్నై సూపర్‌కింగ్స్- దిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతోంది.