ETV Bharat / sports

MI Vs RR Preview: ముంబయి-రాజస్థాన్.. కీలకపోరులో గెలుపెవరిది?

ఐపీఎల్​లో(IPL 2021 News) భాగంగా మంగళవారం(అక్టోబర్ 5) ముంబయి ఇండియన్స్- రాజస్థాన్​ రాయల్స్​(MI Vs RR 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పోటీగా నిలవాలని ఇరు జట్లు​ ప్రణాళికలు రచిస్తున్నాయి.

IPL 2021, MI Vs RR Preview: All eyes on India stars as Mumbai Indians take on upbeat Royals
ముంబయి - రాజస్థాన్..
author img

By

Published : Oct 5, 2021, 5:31 AM IST

Updated : Oct 5, 2021, 7:31 AM IST

ఐపీఎల్‌ 14వ సీజన్‌(IPL 2021) చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తులు(IPL Playoffs 2021) ఖరారు చేసుకోగా ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచిన ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు(MI Vs RR 2021) మంగళవారం సాయంత్రం జరగనున్న మ్యాచ్​లో తలపడనున్నాయి. ఇప్పటికే చెరో 10 పాయింట్లతో(IPL Points Table 2021) కొనసాగుతున్న ఈ రెండు జట్లు.. ఈ మ్యాచ్​లో విజయం సాధించి మరింత ఆధిపత్యం చెలాయించాలని ఆశిస్తున్నాయి.

రెండు మ్యాచ్​ల్లోనూ గెలిస్తేనే

గతేడాది యూఏఈలో జరిగిన సీజన్​లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్​ జట్టు.. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు లీగ్​లో 12 మ్యాచ్​లు ఆడిన రోహిత్​ సేన కేవలం 5 మ్యాచ్​ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇక ప్లేఆఫ్స్​కు చేరాలంటే నేడు జరగబోయే మ్యాచ్​తో పాటు మరో పోరులోనూ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్​తో జరిగే మ్యాచ్​లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలని ముంబయి సన్నద్ధమవుతోంది.

అయితే గత మ్యాచ్​లో దిల్లీతో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలవ్వడం వల్ల జట్టులో పూర్తి నిరాశ కూరుక్కుపోయింది. దీంతో పాటు పేలవ ప్రదర్శన గత కొన్ని మ్యాచ్​ల్లో జట్టును వెంటాడుతోంది. ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, డికాక్​ టీమ్​కు సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. సూర్యకుమార్​ యాదవ్​ గతమ్యాచ్​లో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత మిడిల్​ ఆర్డర్​లో సౌరభ్​ తివారితో పాటు ఆల్​రౌండర్లు పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, క్రునాల్​ పాండ్యాలు జట్టుకు అవసరమైన సమయంలో రాణించడంలో విఫలమవుతున్నారు. అటు బౌలింగ్​ లైనప్​లో బౌల్ట్​, క్రునాల్​ పాండ్యా, బుమ్రా, కౌల్టర్​ నైల్​ గత మ్యాచ్​లో చెరో వికెట్​ పడగొట్టారు.

జోరు కొనసాగించేనా?

ఐపీఎల్​లో ప్రస్తుత సీజన్​లో ఇప్పటికే 12 మ్యాచ్​లో ఆడిన రాజస్థాన్​ రాయల్స్​ జట్టు 10 పాయింట్లతో.. ముంబయి కంటే మెరుగైన రన్​రేట్​తో ఆరవ స్థానంలో నిలిచింది. మంగళవారం రోజున ముంబయితో జరగనున్న మ్యాచ్​లో గెలిచి నాలుగో స్థానానికి పోటీ పడాలని భావిస్తోంది. అయితే చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన గతమ్యాచ్​లో గెలుపొంది.. ఉత్సాహంతో ఉంది రాజస్థాన్​ జట్టు. ఇదే జోరును ముంబయితో మ్యాచ్​లోనూ కొనసాగించాలని చూస్తోంది. రాజస్థాన్​ జట్టులో ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ లూయిస్​, జైశ్వాల్​ సహా మిడిల్​ ఆర్డర్​లో​ సంజూ శాంసన్​, శివమ్ దుబే, ఫిలిప్స్​ వంటి వారితో బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. మరోవైపు బౌలింగ్​ లైనప్​లో రాహుల్​ తెవాతియా తిరిగి ఫామ్​లోకి రాగా.. సకారియా, ముస్తఫిజుర్​ ఫర్వాలేదనిపిస్తున్నారు. అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ సత్తా చాటితే ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

ఏ సమయంలో..

రాజస్థాన్​ రాయల్స్, ముంబయి ఇండియన్స్​ మధ్య జరగనున్న మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

తుదిజట్లు(అంచనా):

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్​ కీపర్​), శివమ్​ దుబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్.

ముంబయి ఇండియన్స్​: రోహిత్​ శర్మ(కెప్టెన్​), క్వింటన్​ డికాక్(వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్​, సౌరభ్ తివారి, క్రునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరన్​ పొలార్డ్, కౌల్టర్​ నైల్, జయంత్ యాదవ్, జస్​ప్రిత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్.

ఇదీ చూడండి.. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​పై హిట్​మ్యాన్​ సంచలన వ్యాఖ్యలు

Last Updated : Oct 5, 2021, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.