ETV Bharat / sports

సీఎస్కే జోరుకు ముంబయి బ్రేకులు వేసేనా? - mi vs csk

దిల్లీ వేదికగా శనివారం ముంబయి ఇండియన్స్​-చెన్నై సూపర్ కింగ్స్​ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. బలాబలాల పరంగా చూస్తే ఇరుజట్లు సమానంగా కనిపిస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

mumbai vs chennai, rohit sharma, dhoni
ముంబయి vs చెన్నై, రోహిత్ శర్మ, ధోనీ
author img

By

Published : May 1, 2021, 5:35 AM IST

ఐపీఎల్​లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇందుకు దిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియం వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో టాప్​-4లో ఉన్న ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలో అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్​లాడిన ఇరుజట్లలో రోహిత్ సేన మూడు పరాజయాలు, మూడు విజయాలతో ఉండగా.. ధోనీ సేన ఐదు విజయాలను ఖాతాలో వేసుకుంది. ఓటమితో సీజన్​ను ప్రారంభించిన చెన్నై.. తర్వాత గొప్పగా పుంజుకొంది. వరుస విజయాలతో మునుపటి ఛాంపియన్​ చెన్నైను తలపిస్తుంది ధోనీసేన.

చెన్నైకు అడ్డుందా?

తొలి మ్యాచ్​లో ఓటమి మినహా మిగతా మ్యాచ్​లన్నింటిలో విజయాలు సాధించిన ధోనీసేన టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా నిలిచింది. నిలకడైన ఆటతీరుతో ఓపెనింగ్ జోడీ.. ప్రత్యర్థులకు సవాలు విసురుతుంది. డుప్లెసిస్​-రుతురాజ్​ జంట.. జట్టుకు దాదాపు ప్రతి మ్యాచ్​లోనూ శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత వన్​డౌన్​లో క్రీజులోకి వస్తున్న మొయిన్​ అలీ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక రైనా, జడేజా, అంబటి రాయుడు, ధోనీ.. టీమ్​కు అవసరమైనప్పుడు బ్యాట్​ ఝుళిపిస్తున్నారు.

ఇక బౌలింగ్​లో దీపక్ చాహర్​తో పాటు ఎంగిడి, జడేజా, మొయిన్ అలీ రాణిస్తున్నారు. వీరితో పాటు శార్దుల్ ఠాకుర్,​ సామ్​ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ధోనీ సేనకు ఎదురుండదు. గత సీజన్​లో ప్లేఆఫ్​కు చేరని చెన్నై.. ఈ దఫా మళ్లీ ఛాంపియన్​ చెన్నైను గుర్తుకుతెస్తోంది. వరుస విజయాలతో టైటిల్ ఫెవరేట్​గా మారింది.

ఇదీ చదవండి: డబ్ల్యూబీసీ ఛాంపియన్​షిప్ పోటీలు వాయిదా

ముంబయి విజయాలను కొనసాగించేనా?

గత మ్యాచ్​లో పంజాబ్​పై ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి తిరిగి విజయాన్ని అందుకుంది. 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్​ డికాక్​ ఫామ్ అందుకున్నాడు. కృనాల్ పాండ్య కూడా చాలా రోజుల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్, ఇషాన్​ కిషన్, కీరన్​ పొలార్డ్​ రాణిస్తున్నారు. ఈ సీజన్​లో ఇంతవరకు మంచి ప్రదర్శన చేయని ఆటగాడు ఉన్నాడంటే అది హార్దిక్ పాండ్య మాత్రమే. అతడు కూడా గాడిలో పడితే ముంబయి మిడిలార్డర్​ కుదుటపడ్డట్లే.

ఇక బౌలింగ్​లో అత్యుత్తమ ప్రపంచ స్థాయి బౌలర్లు బుమ్రా, బౌల్ట్​.. ప్రత్యర్థులకు తమ యార్కర్లతో ఊపిరి సలపనివ్వట్లేదు. డెత్​ ఓవర్లలో పరుగులు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వీరితో పాటు రాహుల్ చాహర్, కౌల్టర్​ నైల్, కృనాల్ పాండ్య ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇక సమష్టిగా రాణిస్తే ముంబయి.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం.

ఇదీ చదవండి: 'భారత్​లోనే టీ20 ప్రపంచ కప్.. వేదికలు నాలుగే​!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.