ETV Bharat / sports

ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన కోల్​కతా - పంజాబ్ vs కోల్​కతా

అహ్మదాబాద్ వేదికగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ బ్యాట్స్​మెన్లలో రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ రాణించారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్​, షమి, హుడా, అర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

punjab vs kolkata, ian morgan, k l rahul
పంజాబ్ vs కోల్​కతా, ఇయాన్ మోర్గాన్, కేఎల్ రాహుల్
author img

By

Published : Apr 26, 2021, 11:11 PM IST

Updated : Apr 26, 2021, 11:23 PM IST

గత నాలుగు మ్యాచ్​ల్లో ఓడిన కోల్​కతా.. ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. అహ్మదాబాద్​ వేదికగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో మోర్గాన్​ సేన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేకేఆర్​ జట్టులో రాహుల్​ త్రిపాఠి(32 బంతుల్లో 41 పరుగులు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40 బంతుల్లో 47 పరుగులు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్​, షమి, హుడా, అర్షదీప్​ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇదీ చదవండి: సమష్టిగా రాణించిన​ బౌలర్లు.. కోల్​కతా లక్ష్యం 124

లక్ష్య ఛేదనలో కోల్​కతాకు శుభారంభం లభించలేదు. 17 పరుగులకే ఓపెనర్లతో పాటు నరైన్ వికెట్​ను కోల్పోయింది కోల్​కతా. వీరిలో రానా, నరైన్ డకౌట్​గా వెనుదిరిగారు. దీంతో మరో ఓటమి తప్పదని భావించారంతా. ఈ దశలో జట్టుకట్టిన కెప్టెన్ మోర్గాన్-రాహుల్ త్రిపాఠి జోడీ నాలుగో వికెట్​కు 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టును సురక్షిత స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓ అనవసరపు షాట్​కు యత్నించి త్రిపాఠి ఔటయ్యాడు. మిగిలిన పనిని మోర్గాన్​ పూర్తిచేశాడు.

ఇదీ చదవండి: 'అలా ఉండటం కష్టం.. ఒక్కడే మ్యాచ్​ లాగేసుకున్నాడు'

Last Updated : Apr 26, 2021, 11:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.