ఐపీఎల్లో (IPL 2021) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో (Hardik Pandya) బౌలింగ్ చేయించేందుకు తొందరేమి లేదని ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. బౌలింగ్ చేయమని ఒత్తిడి చేస్తే హార్దిక్ ఇబ్బంది పడే అవకాశం ఉందని వెల్లడించాడు. అది.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021 India Squad) అతడి ప్రదర్శనపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపాడు.
"చాలాకాలంగా హార్దిక్ బౌలింగ్ (Hardik Pandya Bowling) చేయలేదు. అతడికి ఏది సరైందో అదే చేస్తాం. హార్దిక్ అంశంపై టీమ్ఇండియా యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. అతడు ఐపీఎల్లో బౌలింగ్ చేయడంపై రోజూవారీ సమీక్షిస్తున్నాం. కానీ అందుకోసం బలవంతం చేస్తే అతడు ఇబ్బంది పడే అవకాశం ఉంది."
- మహేలా జయవర్ధనే, ముంబయి ఇండియన్స్ కోచ్
నిజంగానే ఫిట్‌గా ఉన్నాడా?
ఐపీఎల్ రెండో దశలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్.. ముంబయికి (Mumbai Indians News) కేవలం బ్యాట్స్‌మన్‌గానే ఆడుతున్నాడు. దీంతో అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న వరల్డ్‌కప్ కోసం అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని సెలక్టర్లు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మునుపటిలా లేదు..
2019లో వెన్నుముక సర్జరీ(Hardik Pandya Back Operation) జరిగిన నాటి నుంచి హార్దిక్ మునుపటిలా బౌలింగ్ చేయడం లేదు. అయితే ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం రెగ్యూలర్లా బౌలింగ్ చేశాడు. భారత్‌లో జరిగిన తొలి దశ ఐపీఎల్లో బౌలింగ్ చేయని హార్దిక్.. యూఏఈలోని రెండో దశలోనూ అదే కొనసాగిస్తున్నాడు.
ఇవీ చూడండి:
sehwag on hardik: 'టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా అలా ఆడాలి'