ETV Bharat / sports

'శుభ్​మన్ ఆ జాబితాలో తప్పక ఉంటాడు' - david hussey news

రాజస్థాన్​తో మ్యాచ్​లో ఓటమిపై స్పందించాడు కేకేఆర్ చీఫ్ మెంటర్​ డేవిడ్ హస్సీ. తమ ప్రణాళికకు విరుద్ధంగా ఆటగాళ్లు ఆడారని పేర్కొన్నాడు. సీజన్​ పూర్తయ్యే సమయానికి శుభ్​మన్​ గిల్.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉంటాడని తెలిపాడు.

Gill will finish as leading run-getter by the time tournament ends, says David Hussey
డేవిడ్ హస్సీ, శుభ్​మన్ గిల్
author img

By

Published : Apr 25, 2021, 7:31 PM IST

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపై స్పందించాడు కోల్​కతా నైట్ రైడర్స్​ చీఫ్ మెంటర్​ డేవిడ్ హస్సీ. ఈ మ్యాచ్​లో తమ ఆటగాళ్లు ప్రణాళికకు విరుద్ధంగా ఆడారని తెలిపాడు. తమ ఓపెనర్​ శుభ్​మన్ గిల్​ సీజన్​ పూర్తయ్యే సమయానికి అత్యధిక పరుగుల జాబితాలో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ స్టార్​ ప్లేయర్​. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్​లో అంచనాలకు మించి రాణించాడు. అతని విషయంలో నేనొకటి చెప్పగలను. ఫామ్​ వస్తుంది పోతుంది. కానీ, క్లాస్ అనేది క్రికెట్​లో చాలా ముఖ్యం. అతడొక అద్భుతమైన క్లాస్​ ఆటగాడు. నేను చెప్పేది గుర్తు పెట్టుకోండి. ఈ లీగ్ పూర్తయ్యేసరికి అత్యధిక పరుగుల జాబితాలో అతడు ఉంటాడు."

-డేవిడ్ హస్సీ, కోల్​కతా నైట్ రైడర్స్​ మెంటర్​.

"తొలి ఆరు ఓవర్లు జాగ్రత్తగా ఆడాలన్నది మా ప్రణాళికలో లేదు. రాజస్థాన్ బౌలర్లు మమ్మల్ని నిలువరించారు. క్రెడిట్​ అంతా వాళ్లకే దక్కుతుంది. మ్యాచ్​లో పైచేయి సాధించకుండా అడ్డుకున్నారు. ఆట విషయంలో కోచ్​ బ్రెండన్​ మెక్​కల్లమ్ పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దురదృష్టవశాత్తూ వినోదాత్మక క్రికెట్​ను అందిచడంలో మేము విఫలమయ్యాము" అని హస్సీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: జడేజా విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 192

ఇదీ చదవండి: సీఎస్​కే ఛైర్మన్​ సబరత్నం కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.