ETV Bharat / sports

IPL 2021 Final: టాస్​ గెలిచిన కోల్​కతా.. చెన్నై బ్యాటింగ్​ - CSK vs KKR IPL Match Today

ఐపీఎల్​ 14వ సీజన్​ ఫైనల్​ మ్యాచ్​ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైటర్​ రైడర్స్​ జట్లు(CSK Vs KKR) తలపడనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2021 Final, CSK Vs KKR
చెన్నై వర్సెస్​ కోల్​కతా
author img

By

Published : Oct 15, 2021, 7:02 PM IST

Updated : Oct 15, 2021, 7:15 PM IST

ఐపీఎల్‌14వ సీజన్(IPL 2021 Final) ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు(KKR Vs CSK) నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరు జట్లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై.. రెండు సార్లు కప్పు ముద్దాడిన కేకేఆర్ జట్లు మరో టైటిల్‌ను తమఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలింగ్​ ఎంచుకుంది.

కెప్టెన్​గా​ ధోనీకి ఇది 300వ టీ20 మ్యాచ్​.. అంతేకాకుండా ఆల్​రౌండర్​ జడేజాకు 200వ ఐపీఎల్​ మ్యాచ్​ కావడం విశేషం. మరోవైపు ఓపెనర్​ ఫాఫ్​ డుప్లెసిస్​ 100వ ఐపీఎల్​ మ్యాచ్​ను ఆడుతున్నాడు.

తుదిజట్లు:

కోల్​కతా నైట్​రైడర్స్​: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్​ అయ్యర్​, నితీశ్​ రానా, రాహుల్​ త్రిపాఠి, దినేశ్​ కార్తిక్​(వికెట్​ కీపర్​), ఇయాన్​ మోర్గాన్​(కెప్టెన్​), షకిబ్​ అల్​ హసన్​, సునీల్​ నరైన్​, ఫెర్గూసన్​, శివమ్​ మావి, వరుణ్​ చక్రవర్తి,

చెన్నై సూపర్​ కింగ్స్​: రుతురాజ్​ గైక్వాడ్​, ఫాఫ్ డుప్లెసిస్​, రాబిన్​ ఉతప్ప, మొయిన్​ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్​ ధోనీ(వికెట్​ కీపర్​, కెప్టెన్​), రవీంద్ర జడేజా, శార్దూల్​ ఠాకూర్​, డ్వేన్​ బ్రావో, దీపక్​ చాహర్​, జోష్​ హాజిల్​వుడ్​.

ఇదీ చూడండి.. IPL 2021 Final: '‌మోర్గాన్‌ కన్నా ధోనీనే బాగా ఆడుతున్నాడు'‌

Last Updated : Oct 15, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.