కోల్‌కతాతో జరుగుతున్న ఐపీఎల్ తుదిపోరులో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్ (86) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌కు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్(32) జంట తొలి వికెట్‌కు(61 పరుగులు) శుభారంభం అందించారు. రుతురాజ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(31) ధాటికి ఆడాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించి నరైన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
రుతురాజ్ కూడా నరైన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రుతురాజ్, ఉతప్ప ఔటైనా చెన్నై దూకుడు మాత్రం తగ్గలేదు. ఓ ఎండ్‌లో డుప్లెసిస్ అర్ధశతకం సాధించి ఫాస్ట్‌గా ఆడగా.. మరోవైపు మొయిన్ అలీ (34) బీభత్సం సృష్టించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. మిగిలిన కేకేఆర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఇదీ చూడండి.. IPL 2021 Final: టాస్ గెలిచిన కోల్‌కతా.. చెన్నై బ్యాటింగ్