ఐపీఎల్ తొలి దశలో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో దశ కూడా కలిసిరాలేదు. దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
సన్‌రైజర్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని పంత్ సేన 17.5 ఓవర్లలోనే ఛేదించింది. శిఖర్ ధావన్(42), శ్రేయస్ అయ్యర్(47) నాటౌట్, రిషభ్ పంత్(35) నాటౌట్ వల్ల దిల్లీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్‌ఖాన్ , ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే నోర్జే వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ఔటయ్యాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18) కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా ఆకట్టుకోలేకపోయాడు. స్వల్ప వ్యవధిలో రెండు జీవనాధారాలు లభించినా భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. మనీశ్ పాండే (17), కేదార్ జాదవ్ (3), జాసన్ హోల్డర్ (10) రాణించలేదు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) రాణించడం వల్ల హైదరాబాద్ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: IPL 2021: సన్‌రైజర్స్ మళ్లీ అదే తీరు.. దిల్లీ లక్ష్యం 135