ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ మరో బౌలర్​కు కరోనా - క్రికెట్ న్యూస్

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ మరో ఆటగాడికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. అక్షర్ పటేల్​కు ఇప్పటికే పాజిటివ్​ రాగా, ఇప్పుడు అన్రిచ్ నోర్జే కూడా వైరస్​ బారినపడ్డాడు.

IPL 2021: DC fast bowler Anrich Nortje tests Covid positive
దిల్లీ క్యాపిటల్స్​ మరో బౌలర్​కు కరోనా
author img

By

Published : Apr 14, 2021, 3:46 PM IST

దిల్లీ క్యాపిటల్స్​కు మరో దెబ్బ! ఆ జట్టు బౌలర్ అన్రిచ్ నోర్జేకు కరోనా పాజిటివ్​గా తేలింది. స్వదేశంలో పాకిస్థాన్​తో వన్డే సిరీస్​ ఆడిన ఈ దక్షిణాఫ్రికా బౌలర్.. ఇటీవల ముంబయి చేరుకుని, క్వారంటైన్​లో ఉన్నాడు. తాజాగా చేసిన వైద్యపరీక్షల్లో అన్రిచ్​కు పాజిటివ్​గా తేలింది. దీంతో మరికొన్నిరోజుల పాటు, అతడు బయో బబుల్ బయట క్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెగిటివ్​ వస్తేనే జట్టుతో కలుస్తాడు.

కరోనా కారణంగా అక్షర్ పటేల్ ఇప్పటికే క్వారంటైన్​లో ఉండగా, గాయం కారణంగా కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​ సీజన్​ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో పంత్​ సారథిగా వ్యవహరిస్తున్నాడు. తొలి మ్యాచ్​లో చెన్నైపై గెలిచిన దిల్లీ.. రాజస్థాన్ రాయల్స్​తో గురువారం తర్వాతి మ్యాచ్ ఆడనుంది.​

ఇది చదవండి: 'మాస్టర్'​ పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.