ETV Bharat / sports

IPL 2021: 'వార్నర్​లానే రైనానూ పక్కనపెట్టేయొచ్చు'

ఐపీఎల్​ 2021లో (IPL 2021) బ్యాటింగ్​లో విఫలమవుతున్నాడు చెన్నై సూపర్​కింగ్స్ స్టార్ బ్యాట్స్​మన్ సురేశ్ రైనా. ఈ నేపథ్యంలో​ సీఎస్​కేలో దిగ్గజ ఆటగాడిగా కొనసాగిన రైనాకు ఇదే చివరి ఐపీఎల్​ కావొచ్చని వ్యాఖ్యానించాడు మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్.

Suresh Raina
చెన్నై సూపర్ కింగ్స్
author img

By

Published : Oct 2, 2021, 9:00 PM IST

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో (IPL 2021) ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాకు ఇదే ఆఖరి సీజన్‌ అయ్యే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌ డేల్ స్టెయిన్‌ (Dale Steyn Raina), సంజయ్‌ మంజ్రేకర్‌ విశ్లేషించారు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే ఒక్క అర్ధ శతకం సాధించిన అతడు తర్వాత ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. దీంతో మొత్తం 11 మ్యాచ్‌ల్లో ఆడిన రైనా కేవలం 157 పరుగులే చేసి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ క్రీడా ఛానెల్లో ముచ్చటించిన స్టెయిన్‌(Dale Steyn Raina), మంజ్రేకర్‌ పైవిధంగా స్పందించారు.

"ఐపీఎల్‌లో రైనాకు ఇదే చివరి సీజన్‌ అయ్యే అవకాశం ఉంది. చెన్నై జట్టులో అతడో దిగ్గజ ఆటగాడిగా కొనసాగాడు. అలాంటిది ఇప్పుడు కష్టంగా మారింది. ఎవరైనా పరుగులు చేయకపోతే పక్కకు జరగాల్సిందే. డేవిడ్‌ వార్నర్‌కు కూడా ఇదే జరిగింది. మనం చూశాం. చాలా మంది ఆటగాళ్లకూ ఇలాగే జరుగుతుంది"

- డేల్ స్టెయిన్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

రైనా బ్యాట్స్​మన్​లా కనపడట్లేదు..

అనంతరం స్పందించిన మంజ్రేకర్‌ (Sanjay Manjrekar).. రైనాలో ఇంకా కొన్ని సీజన్లు ఆడే శక్తిసామర్థ్యాలున్నాయని, అయితే.. ఇప్పుడతడు ఒక బ్యాట్స్‌మన్‌లా కనపడట్లేదని వ్యాఖ్యానించాడు.

చెన్నై (Chennai Super Kings News) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రైనా ఫామ్‌లో లేకపోయినా మిగతా ఆటగాళ్లు రాణిస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీసేన ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి టాప్‌లో దూసుకుపోతుంది.

ఇదీ చూడండి: Dhoni CSK: 'చేయాల్సింది ఇంకా చాలా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.