చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా బుధవారం మ్యాచ్ జరగనుంది. మరి సీఎస్కే జోరుకు కేకేఆర్ అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి.
ఫుల్ జోష్‌లో సీఎస్కే..
ధోనీ నేతృత్వంలోని చెన్నై జ్టటు.. ఆడిన తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. మొదట్లో బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ, బౌలింగ్‌లో తేలిపోయింది. కానీ గత మ్యాచులో రాజస్థాన్‌పై సమష్టి ప్రదర్శనతో అద్భుతంగా ఆడింది. ఇదే జోరును కొనసాగిస్తే కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయం. అయితే ధోనీ బ్యాట్‌తో అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: మిశ్రా మాయ.. దిల్లీ జీత్‌గయా..
కేకేఆర్ గెలుస్తుందా?
ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిపోయింది మోర్గాన్ సేన. నితీశ్ రానా, శుభమన్ గిల్, త్రిపాఠి నిలకడ ప్రదర్శన చేయలేకపోతున్నారు. దినేశ్ కార్తీక్ నామమాత్రంగా ఆడుతున్నాడు. ఆల్‌రౌండర్స్ రస్సెల్, హర్భజన్ నిరాశపరుస్తున్నారు. బౌలింగ్‌లోనూ నిలకడ లేదు. చక్రవర్తి, కమిన్స్, షాకిబ్, ప్రసిద్ధ్ కృష్ణ రాణించాల్సి ఉంది. ఇలానే ఆడితే చెన్నైను కట్టడి చేయడం కష్టం. కాబట్టి మరింత మెరుగవ్వాల్సిందే. లేదంటే మరో ఓటమిని ఖాతాలో వేసుకుంటారు.
ఇదీ చదవండి: రైజర్స్xకింగ్స్: గెలుపు ఆకలి తీరేదెవరికో!