కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌నూ వదిలేలా లేదు. బయోబబుల్ లాంటి సురక్షిత వాతావారణం సృష్టించిన తర్వాత కూడా ఆటగాళ్లు కరోనా బారిన పడటం నిర్వాహకుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. టోర్నీ ప్రారంభంలోనే పలువురు ఆటగాళ్లకు వైరస్ సోకినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన లీగ్‌ను మరోసారి మహమ్మారి ఆలోచనలో పడేసింది. భారత్‌లో కేసులు పెరగడం, మైదాన సిబ్బందికి కరోనా సోకడం, ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల అసలు ఈ క్యాష్ రిచ్ లీగ్ సజావుగా సాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీగ్‌ను రద్దు చేయాలంటే సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ ఊపందుకున్నాయి.
-
#CancelIPL is Trending Meanwhile Kohli Reaction will be👇😂 But Don't Cancel #IPL2021 #KKRvRCB #RCBvsKKR #cancelipl2021 #postponed pic.twitter.com/HOZfs1OqBj
— 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 (𝗦𝘁𝗮𝘆 𝗛𝗼𝗺𝗲 𝗦𝘁𝗮𝘆 𝗦𝗮𝗳𝗲) (@IamSanjay_v) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#CancelIPL is Trending Meanwhile Kohli Reaction will be👇😂 But Don't Cancel #IPL2021 #KKRvRCB #RCBvsKKR #cancelipl2021 #postponed pic.twitter.com/HOZfs1OqBj
— 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 (𝗦𝘁𝗮𝘆 𝗛𝗼𝗺𝗲 𝗦𝘁𝗮𝘆 𝗦𝗮𝗳𝗲) (@IamSanjay_v) May 3, 2021#CancelIPL is Trending Meanwhile Kohli Reaction will be👇😂 But Don't Cancel #IPL2021 #KKRvRCB #RCBvsKKR #cancelipl2021 #postponed pic.twitter.com/HOZfs1OqBj
— 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 (𝗦𝘁𝗮𝘆 𝗛𝗼𝗺𝗲 𝗦𝘁𝗮𝘆 𝗦𝗮𝗳𝗲) (@IamSanjay_v) May 3, 2021
-
#CancelIPL
— Tarak Hari Prasad (@TarakHariPrasad) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
RCB Fans now........😁😂 pic.twitter.com/UK4hmIJUjZ
">#CancelIPL
— Tarak Hari Prasad (@TarakHariPrasad) May 3, 2021
RCB Fans now........😁😂 pic.twitter.com/UK4hmIJUjZ#CancelIPL
— Tarak Hari Prasad (@TarakHariPrasad) May 3, 2021
RCB Fans now........😁😂 pic.twitter.com/UK4hmIJUjZ
-
"Cancel IPL" trending
— Pɾαʝαραƚ Şน๓it (@_Sumit47) May 3, 2021 \" class="align-text-top noRightClick twitterSection" data="
Meanwhile RCB to them...😂😂😂#postponed #CancelIPL#cancelipl2021 pic.twitter.com/iJGWFQleXT
\">"Cancel IPL" trending
— Pɾαʝαραƚ Şน๓it (@_Sumit47) May 3, 2021
Meanwhile RCB to them...😂😂😂#postponed #CancelIPL#cancelipl2021 pic.twitter.com/iJGWFQleXT
\"Cancel IPL" trending
— Pɾαʝαραƚ Şน๓it (@_Sumit47) May 3, 2021
Meanwhile RCB to them...😂😂😂#postponed #CancelIPL#cancelipl2021 pic.twitter.com/iJGWFQleXT
కేకేఆర్, చెన్నై సిబ్బందికి కరోనా
ఇప్పటివరకు సగం టోర్నీ పూర్తయింది. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అభిమానులు వారి వారి జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అంతా సజావుగానే సాగుతుంది అనే సమయంలోనే మరోసారి కరోనా తెరపైకి వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో నేడు (సోమవారం) కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. వీరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ బాలాజీ, బస్ క్లీనర్‌కు వైరస్ సోకింది. దీంతో మరోసారి లీగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దిల్లీ మైదానం సిబ్బందికీ కరోనా!
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం రాజస్థాన్-హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించిన ఐదుగురు సిబ్బందికి కరోనా సోకడం మరింత ఆందళోన కలిగిస్తోంది. వీరు ఆటగాళ్లను కలిసే వీలు ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు, దీంతో లీగ్‌లో మరికొన్ని మ్యాచ్‌లు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాల్దీవులకు జంప్ అయిన కామెంటేటర్!
భారత్‌లో కరోనా కేసులు పెరగడం, విదేశాల్లో రవాణాపై ఆంక్షలు పెడుతుండటం వల్ల ఐపీఎల్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు ఆటగాళ్లు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన పలువురు క్రికెటర్లు లీగ్ మధ్యలోనే వారి దేశం వెళ్లిపోయారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆసీస్‌కు చెందిన కామెంటేటర్ మైఖేల్ స్లేటర్ బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించినట్లు తెలుస్తోంది. వారి దేశంలో రవాణా ఆంక్షలు విధించడం వల్ల ఇతడు మాల్దీవులకు వెళ్లిపోయాడని సమాచారం. మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోనున్నారని తెలుస్తోంది.
యూఏఈనే బెటర్!
కరోనా కారణంగా గతేడాది లీగ్‌ను యూఏఈలో నిర్వహించారు. అక్కడ కూడా కేసులు పెరిగినా లీగ్ మాత్రం సజావుగా సాగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగి అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఈ ఏడాది కూడా కరోనా విజృంభిస్తున్నా 14వ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు మొగ్గుచూపింది బీసీసీఐ. కానీ ఇది అనుకున్నంత ఫలితం ఇవ్వట్లేదని తెలుస్తోంది. దేశంలో రోజుకు లక్షల్లో కేసులు రావడం, బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు వైరస్ సోకడం వల్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా లీగ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతందని చెబుతున్నారు. అయినా బయోబబుల్లోనూ కరోనా రావడం వల్ల గతేడాది లీగ్‌ను యూఏఈ ఉత్తమంగా నిర్వహించిందని అంటున్నారు.
-
After seeing #CancelIPL trend,
— Venkatesh Gattu (@VenkateshGattu2) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Me to BCCI: pic.twitter.com/6r3jSoc4gl
">After seeing #CancelIPL trend,
— Venkatesh Gattu (@VenkateshGattu2) May 3, 2021
Me to BCCI: pic.twitter.com/6r3jSoc4glAfter seeing #CancelIPL trend,
— Venkatesh Gattu (@VenkateshGattu2) May 3, 2021
Me to BCCI: pic.twitter.com/6r3jSoc4gl
-
Warner be like : I will play in place of nabi without knowing to management to win srh#DavidWarner #SRHvMI #ipl #cancelipl2021 #cancelipl pic.twitter.com/vsN6WFss1M
— Katta Vinod (@KattaVinod12) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Warner be like : I will play in place of nabi without knowing to management to win srh#DavidWarner #SRHvMI #ipl #cancelipl2021 #cancelipl pic.twitter.com/vsN6WFss1M
— Katta Vinod (@KattaVinod12) May 3, 2021Warner be like : I will play in place of nabi without knowing to management to win srh#DavidWarner #SRHvMI #ipl #cancelipl2021 #cancelipl pic.twitter.com/vsN6WFss1M
— Katta Vinod (@KattaVinod12) May 3, 2021