ETV Bharat / sports

బంతికి ఉమ్ము రుద్దిన మిశ్రా.. అంపైర్ వార్నింగ్ - Amit Mishra applies saliva on ball

బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్ అమిత్​ మిశ్రా అనుకోకుండా బంతికి ఉమ్ము రుద్దాడు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్​ దిల్లీ కెప్టెన్ పంత్​కు మొదటి హెచ్చరిక జారీ చేశాడు.

Amit Mishra applies saliva on ball, umpire gives first warning
అమిత్ మిశ్రా, దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​
author img

By

Published : Apr 27, 2021, 9:43 PM IST

అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ అమిత్ మిశ్రా అనుకోకుండా ఓ తప్పిదం చేశాడు. బంతికి ఉమ్ము రుద్దుతూ ఫీల్డ్​ అంపైర్​కు దొరికిపోయాడు. గమనించిన అంపైర్​ వీరేందర్​ శర్మ దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్​కు మొదటి వార్నింగ్​ ఇచ్చాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ ఆటగాళ్లకు క్రికెట్​ ఆస్ట్రేలియా హామీ

ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తోన్న​ సమయంలో ఆరో ఓవర్​ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. కొవిడ్ మార్గదర్శకాలలో భాగంగా ఐసీసీ బంతికి ఉమ్మును రుద్దడాన్ని నిషేధించింది. బదులుగా చెమటను రుద్దే అవకాశాన్ని కల్పించింది. మొదటి సారి ఈ తప్పిదం చేస్తే ఆ జట్టు సారథిని హెచ్చరికతో వదిలేస్తారు. మరోసారి ఆ టీమ్​ ఆటగాడు ఇదే తప్పిదాన్ని చేస్తే ప్రత్యర్థికి 5 పరుగులు అదనంగా ఇస్తారు.

ఇదీ చదవండి: రాణించిన డివిలియర్స్​.. దిల్లీ లక్ష్యం 172

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.