భారత్‌లో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. పలు దేశాలు ఇక్కడి పౌరులను అనుమతించడం లేదు. భారత్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడిచింది. మే 15 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అయితే, ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత్‌లో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ స్లేటర్ మరోసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ట్వీట్లు చేశాడు.
"మానవ సంక్షోభం గురించి ప్రధాని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతి ఆస్ట్రేలియన్ భయంతో ఉన్నాడన్నది నిజం! మీ ప్రైవేట్ జెట్లో వచ్చి ఇక్కడి వీధుల్లో ఉన్న మృతదేహాలను చూస్తే అర్థమవుతుంది." అని అన్నాడు.
-
Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street!
— Michael Slater (@mj_slats) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street!
— Michael Slater (@mj_slats) May 5, 2021Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street!
— Michael Slater (@mj_slats) May 5, 2021
మరో ట్వీట్లో కరోనాతో సతమతమవుతున్న భారత్కు సంఘీభావం తెలిపాడు. "కరోనాతో పోరాడుతున్న భారతీయులకు నా సంఘీభావం. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మీరు నాకు అద్భుతంగా కనిపిస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి.'' అని ట్వీట్ చేశాడు.
-
Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx
— Michael Slater (@mj_slats) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx
— Michael Slater (@mj_slats) May 5, 2021Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx
— Michael Slater (@mj_slats) May 5, 2021
ఇదీ చూడండి: 'మా ప్రధాని చేతికి నెత్తురంటింది'