ETV Bharat / sports

మ్యాచ్​పై వార్నర్ అలా.. రోహిత్ శర్మ ఇలా - మ్యాచ్​ విజయంపై రోహిత్ శర్మ

శనివారం జరిగిన మ్యాచ్​పై హైదరాబాద్, ముంబయి కెప్టెన్లు స్పందించారు. బౌలర్ల సరైన వ్యూహం వల్లే గెలిచామని రోహిత్ చెప్పగా, పేలవ బ్యాటింగ్​ వల్ల ఓడిపోయామని వార్నర్ అన్నాడు.

warner, rohith sharma
వార్నర్, రోహిత్ శర్మ
author img

By

Published : Apr 18, 2021, 9:58 AM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలిచి, ఈ సీజన్​లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది ముంబయి ఇండియన్స్. బౌలర్ల సరైన వ్యూహం వల్లే ఇది సాధ్యమైందని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాము వరుసగా మ్యాచ్​లు ఓడిపోవడానికి పేలవ బ్యాటింగ్​ అని సన్​రైజర్స్ సారథి వార్నర్​ అభిప్రాయపడ్డాడు.

"బౌలర్లు సరైన వ్యూహంతో ఉంటే కెప్టెన్​కు మ్యాచ్​ నెగ్గడం సులభం అవుతుంది. మ్యాచ్​ గెలిచేందుకు ఆటగాళ్లు బాగా కృషి చేశారు. పిచ్ సరిగ్గా లేని కారణంగా గెలవడం అంత సులభం కాదని అర్థమైంది. కానీ, బౌలర్లు చక్కగా రాణించి కెప్టెన్​పై భారాన్ని తగ్గించారు. జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్​ బాగా చేశారు"

--రోహిత్ శర్మ, ముంబయి కెప్టెన్

పేలవ బ్యాటింగ్​ వల్లే...

"ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించొచ్చు. కానీ, బ్యాటింగ్​లో విఫలమయ్యాం. మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్ తెలివిగా ఆడాలి. బౌలింగ్​లో దృఢంగానే ఉన్నాం. ఇదే తప్పు మళ్లీ జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత బ్యాట్స్​మెన్​ చేతిలోనే ఉంది."

--డేవిడ్ వార్నర్, సన్​రైజర్స్​ జట్టు సారథి.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా మూడో మ్యాచ్​లో ఓటమిపాలైంది. ముంబయితో శనివారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 150/5 పరుగులు చేయగా, ఛేదనలో 19.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది హైదరాబాద్‌.

ఇదీ చదవండి:వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.