ETV Bharat / sports

టీమ్​ఇండియాకు అతడు 100 టెస్టులు ఆడేలా చేస్తా: పాంటింగ్ - హార్దిక్ పాండ్య

Ricky Ponting: టీమ్ఇండియా తరఫున ఓ యువ క్రికెటర్.. 100 టెస్టులు ఆడేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. ఐపీఎల్​లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా కోసం ఈ మేరకు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని అన్నాడు. ఇక పృథ్వీ ఆట చూస్తుంటే తన ఆటే చూస్తున్నట్లు ఉందని కొనియాడాడు.

Ricky Ponting
Prithvi Shaw
author img

By

Published : Apr 11, 2022, 8:35 PM IST

Ricky Ponting: దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్​ పృథ్వీ షాపై ఆ జట్టు కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీ ఆట చూస్తుంటే తన ఆటే గుర్తుకు వస్తుందని ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్​ పాడ్​కాస్ట్​లో అన్నాడు. ఐపీఎల్​ 2022లో గత రెండు మ్యాచ్​ల్లో అర్ధశతకాలతో అదరగొట్టాడు పృథ్వీ. 2018 నుంచి దిల్లీకి ఆడుతున్న పృథ్వీని మెగా వేలానికి ముందు ఆ జట్టు రిటెయిన్ చేసుకుంది.

Prithvi Shaw
పృథ్వీ షా

"పృథ్వీ ఆటతీరు చూస్తుంటే అతడికి నా అంత ప్రతిభ ఉందనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. టీమ్​ఇండియా తరఫున 100 టెస్టులు ఆడేలా అతడిని తీర్చిదిద్దాలనుకుంటున్నా. వీలైనంతమేర అతడు తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలి."

-రిక్కీ పాంటింగ్, దిల్లీ కోచ్

నా లక్ష్యం అదే: గతంలో ముంబయి జట్టుకు కోచ్​గా ఉన్న సమయంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటివారికి ట్రైనింగ్ ఇవ్వడం గురించీ పాంటింగ్ ప్రస్తావించాడు. "ముంబయికి కోచ్​గా వెళ్లినప్పుడు.. రోహిత్ యువకుడు. హార్దిక్​, కృనాల్​ ఇంకా ఆడటం మొదలుపెట్టలేదు. నేను కోచింగ్ ఇచ్చిన ఎందరో ఆటగాళ్లు భారత్​కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. నా లక్ష్యం కూడా అదే." అని పాంటింగ్​ చెప్పాడు.

2018లో వెస్టిండీస్​పై అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. గాయాలు, ఫిట్​నెస్ సమస్యలు, నిలకడలేమి ప్రదర్శనలతో జట్టులో చోటు సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇక దిల్లీ శిబిరంలోకి డేవిడ్ వార్నర్​ రాకతో ఆ జట్టు టాప్​ ఆర్డర్​ బలం పెరిగింది. కోల్​కతాపై మ్యాచ్​లో షా-వార్నర్​ కలిసి 93 పరుగుల ఓపెనింగ్​ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ఆ జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు.

ఇదీ చూడండి: చెలరేగిన షా, వార్నర్​.. ఆఖర్లో 'లార్డ్'​ మెరుపులు.. కోల్​కతా ముందు భారీ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.