ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో (IPL 2021) అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం (IPL 2021 Winner) సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్ (5) తర్వాత ఎక్కువ టైటిల్స్ (4) సాధించిన జట్టుగా నిలిచింది (Chennai IPL Titles).
ఐపీఎల్ 2021 ఛాంపియన్స్‌గా (IPL 2021 Champion) నిలిచిన సీఎస్కే రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ (IPL 2021 Prize Money) దక్కుతుంది. రన్నరప్ కేకేఆర్ రూ.12.5 కోట్లు సొంతం చేసుకోనుంది. రెండో క్వాలిఫైయర్ ఓడిన దిల్లీ క్యాపిటల్స్, ఎలిమినేటర్‌లో ఓటమి పాలైన బెంగళూరు ఛాలెంజర్స్‌కు తలో రూ.8.75 కోట్ల చొప్పును అందించనున్నారు.
ఈ సీజన్‌లో మెరిసిన ఆటగాళ్లు.. దక్కిన అవార్డులు..(IPL 2021 Awards)
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 14వ సీజన్ రెండు అంచెలుగా జరిగింది. తొలుత ఏప్రిల్ 9న చెన్నైలో ఆరంభమైన ఈ ప్రయాణం అక్టోబర్ 15న దుబాయ్‌లో ముగిసింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరికి ఫైనల్లో కోల్‌కతాపై (CSK Vs KKR IPL 2021 Final) విజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్ వరకూ చేరాయి. అయితే, ఆ రెండు జట్లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై కప్పుకు దూరమయ్యాయి. అయితే, ఈ సీజన్‌లో ఆయా జట్లలోని పలువురు ఆటగాళ్లు రాణించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దీంతో టోర్నీ నిర్వాహకులు వారందరినీ ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. ఎవరెవరు ఏయే విభాగాల్లో రాణించారంటే?
- ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ (ఆర్సీబీ)
- ఆరెంజ్ క్యాప్: రుతురాజ్ (సీఎస్కే) 635 పరుగులు, 1 శతకం, 4 అర్ధశతకాలు
- పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రావో (2012)తో సమానంగా నిలిచాడు. 5 వికెట్ల ప్రదర్శన ఒకసారి, నాలుగు వికెట్ల ప్రదర్శన మరోసారి.
- పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), (10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు)
- అత్యధిక సిక్సర్లు: కేఎల్ రాహుల్ (పీబీకేఎస్) ఈ సీజన్‌లో ఏకంగా 30 సిక్సులు బాదాడు.
- గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ : హర్షల్ పటేల్
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : సిమ్రన్ హెట్‌మైయర్ (168 స్ట్రైక్‌రేట్)
- క్యాచ్ ఆఫ్ ది సీజన్ : రవిబిష్ణోయ్. అహ్మదాబాద్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ ఆడిన షాట్‌ను డీప్‌మిడ్ వికెట్లో ఫుల్‌లెంత్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
- ఫెయిర్‌ప్లే అవార్డు : రాజస్థాన్ రాయల్స్ జట్టుకు.
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : రుతురాజ్ గైక్వాడ్
ఇదీ చూడండి: Csk ipl trophies: చెన్నై జట్టు.. అందుకే 'సూపర్ కింగ్స్'