ETV Bharat / sports

ముంబయి జట్టు వల్లే అది సాధ్యమైంది: మలింగ - మలింగ ఐపీఎల్ రికార్డులు

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​తో తనకున్న అనుబంధాన్ని వివరించాడు శ్రీలంక మాజీ క్రికెటర్​ లసిత్​ మలింగ. ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వల్లే తాను ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నట్లు వెల్లడించాడు.

Malinga
Malinga
author img

By

Published : Sep 19, 2021, 6:50 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడటం వల్లే భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నట్లు వెల్లడించాడు శ్రీలంక మాజీ క్రికెటర్​ లసిత్​ మలింగ. జట్టుతో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్​లో ఆడటం యువ క్రికెటర్లందరికీ ఒక కల అని అన్నాడు.

"'అద్భుతమైన సహాయక సిబ్బంది కలిగిన ముంబయి ఇండియన్స్‌ జట్టులో చోటు దక్కడం అదృష్టం. ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడటం వల్లే భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నా. 2008లో ముంబయి జట్టుకు ఎంపికయ్యానని నా మేనేజర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. నాతో పాటు మరో ఇద్దరు శ్రీలంక క్రికెటర్లు కూడా ముంబయి ఇండియన్స్​కు ఎంపికయ్యారు. అప్పటికీ అంతర్జాతీయ క్రికెట్​లో నాకు మూడున్నర సంవత్సరాల అనుభవం మాత్రమే ఉంది. ఐపీఎల్​లో మరికొంత నేర్చుకోవడం మంచిదని అనిపించింది. అయితే దురదృష్టం కొద్ది 2008లో మోకాలి గాయంతో మెగాలీగ్​కు దూరమయ్యా. అంతేగాక శ్రీలంక బోర్డు ఒప్పందాన్ని కోల్పోయా. ఇది జరిగిన ఏడాదిన్నరకు నేను క్రికెట్ ఆడాలంటే షార్ట్ ఫార్మాట్లతో ప్రారంభించాలని డాక్టర్లు, ఫిజియోలు సూచించారు. అంటే టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే జాతీయ జట్టుకు ఆడాల్సి ఉన్నప్పటికీ నా పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్​లో ఆడేందుకు అనుమతించింది."

-లసిత్ మలింగ, శ్రీలంక మాజీ క్రికెటర్లు.

మలింగ.. ఐపీఎల్​లో చివరిసారిగా 2019లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడాడు. ఆ తర్వాత రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్​బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. టీ20లో 107, వన్డేల్లో 338, టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో​ మలింగ పడగొట్టిన 170 వికెట్లు ఇప్పటికీ రికార్డే!టీ20ల్లో అత్యధిక వికెట్లు, రెండు హ్యాట్రిక్​ల ఘనత అతడి సొంతం. వన్డేల్లో మూడు హ్యాట్రిక్​లు సాధించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.