ETV Bharat / sports

ఐపీఎల్​ ఆతిథ్యానికి ఇంగ్లీష్​​ కౌంటీలు ఆసక్తి - ఐపీఎల్​ వాయిదా

కరోనా వల్ల వాయిదా పడిన ఐపీఎల్​ను సెప్టెంబరులో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది! దీంతో ఈ మెగాలీగ్​ రెండో అంకానికి ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఇంగ్లీష్​ కౌంటీలు​. ఈ మేరకు ఇంగ్లాండ్​ క్రికెట్​బోర్డుకు తమ విజ్ఞప్తిని తెలిపాయి.

ipl
ఐపీఎల్​
author img

By

Published : May 6, 2021, 7:54 PM IST

Updated : May 6, 2021, 10:49 PM IST

కరోనా వల్ల నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్-14ను​ ఈ ఏడాది సెప్టెంబరులో కొనసాగిస్తారని సమాచారం. అయితే ఈ మెగా లీగ్​ రెండో దశకు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లీష్​ కౌంటీలు ఆసక్తి చూపుతున్నాయి​. ఇందులో భాగంగా మిడిల్​సెక్స్​​, సర్రే, వార్​విక్​షైర్​, లాంకాషైర్​​ కలిసి.. బీసీసీఐకి తమ విన్నపాన్ని అందించాలని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డుకు లేఖ పంపాయి.

కొద్దిరోజుల్లో వర్చువల్​గా జరగబోయే ఐసీసీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ సమావేశంలో ఈ విషయం గురించి బీసీసీఐ, ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సెప్టెంబర్‌లోనే మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్‌లు పూర్తి చేయడానికి ఇంకో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. అదేంటంటే అక్టోబర్‌-నవంబర్‌లో యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు ఉన్నందున అందరి ఆటగాళ్లకు ఆ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రాక్టీస్‌లా ఉపయోగపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ రెండు ఈవెంట్లు యూఏఈలోనే నిర్వహిస్తే పిచ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండే సరైన వేదికగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి ఆసీస్​ ఆటగాళ్లు.. కానీ!

Last Updated : May 6, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.