ETV Bharat / sports

'భారత్​కు ప్రపంచకప్​ అందించడమే నా లక్ష్యం' - టీమిండియా

Dinesh Karthik IPL 2022: టీ20 ప్రపంచకప్​- 2022లో భారత్​ను జగజ్జేతగా నిలపటమే తన లక్ష్యమని వెటనర్​ బ్యాటర్​, వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తీక్​ పేర్కొన్నాడు. ఐపీఎల్​లో శనివారం రాత్రి దిల్లీపై ఆర్​సీబీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం విరాట్​ కోహ్లీతో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడాడు. మరోవైపు.. దినేశ్​ కార్తీక్​పై ప్రశంసలు కురిపించాడు బెంగళూరు కెప్టెన్​ డూప్లిసెస్​.

Dinesh Karthik IPL 2022
దినేశ్​ కార్తీక్​
author img

By

Published : Apr 17, 2022, 3:34 PM IST

Dinesh Karthik IPL 2022: భారత్​కు టీ20 ప్రపంచకప్‌ అందించడమే తన పెద్ద లక్ష్యమని వెటరన్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్​లో బెంగళూరు తరఫున అదిరిపోయే ప్రదర్శన చేస్తోన్న దినేశ్​.. శనివారం రాత్రి దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కార్తీక్‌ మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ప్రస్తుత, దీర్ఘకాల లక్ష్యాలను వెల్లడించాడు.

Dinesh Karthik IPL 2022
దినేశ్​ కార్తీక్​

కోహ్లీ: డీకే చాలా బాగా ఆడావు. మున్ముందు కూడా ఇలాగే ఆడాలని నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తావని నాకు తెలుసు. నిన్ను ఇలా చూడటం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరును గెలిపించినందుకు నీకు ధన్యవాదాలు. 2013 నుంచి ఇదే నీ అత్యుత్తమ ప్రదర్శన. ఇలా రాణించడానికి ఎలా సన్నద్ధమయ్యావ్‌?

డీకే: నాకు ఇప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యమైతే బెంగళూరును గెలిపించడం. అయితే, నేను ఇలా రాణించడానికి కారణం సంజయ్‌ బంగర్‌. మెగా వేలంలో నన్ను ఫినిషర్‌ పాత్ర కోసం దక్కించుకున్నామని ఆయన చెప్పినప్పుడు నాకూ ఇదే కావాలనుకున్నా. అందుకు తగ్గట్టు సన్నద్ధమయ్యా. ఇక దీర్ఘకాలిక లక్ష్యమైతే టీమిండియాకు ప్రపంచకప్‌ అందించడం. ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలనుకుంటున్నా. అలాగే జట్టు విజయాలు సాధించాలని ఆశిస్తున్నా. టీమిండియా మెగా ట్రోఫీలు సాధించి చాలా కాలమైంది. నేను ఇప్పుడు దాన్ని సాధించి పెట్టాలనే కోరికతో ఉన్నా. అందుకోసం చాలా విషయాలపై దృష్టిసారించాలి.

"రోజూ నేను ఒకటే లక్ష్యంతో ప్రాక్టీస్‌ చేస్తా. నాలో అత్యుత్తమ ఆటగాడు బయటకు వచ్చేందుకు నెట్స్‌ సెషన్స్‌లో నా కోచ్‌లు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. వారివల్లే ఇది సాధ్యమైంది. వయసు పెరిగేకొద్దీ ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలి. అందుకోసం నా శక్తిమేర ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు బెంగళూరు తరఫున రాణిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ జట్టుతో రెండోసారి ఆడుతున్నా. దాంతో ఇక్కడ ప్రత్యేకంగా నిలవానుకున్నా" అని డీకే చెప్పుకొచ్చాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. డీకే ఫినిషర్‌గా ఇప్పుడు బెంగళూరుకు విజయాలు అందించడం చూసి మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ సంతోషిస్తుంటాడని చెప్పాడు.

ఆర్​సీబీలో దినేశ్​ ఉండటం మా అదృష్టం: దిల్లీ క్యాపిటల్స్​పై అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని అందించిన దినేశ్​ కార్తీక్​పై ప్రశంసల వర్షం కురిపించాడు బెంగళూరు కెప్టెన్​ ఫాఫ్​ డూప్లిసెస్​. 'టాప్​ ఆర్డర్​ రాణించటం చాలా అవసరం. అయితే.. మరోమారు విఫలమైంది. కానీ, డీసీపై మ్యాక్స్​వెల్​ ఒత్తిడి పెట్టాడు. మ్యాక్సీ, దినేశ్​ ఫామ్​లో ఉండటం మంచి పరిణామం. డీకే తన కేరీర్​లోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. మా టీమ్​లో ఉండటం నిజంగా మా అదృష్టం.' అని పేర్కొన్నాడు డూప్లిసెస్​.

దినేశ్​ కార్తీక్​లో ఏబీ ఆత్మ: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కోసం ఏబీ డివీలియర్స్​ వదిలిపెట్టిన స్థానం నుంచి దినేశ్​ కార్తీక్​ కొనసాగిస్తున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్​ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. డూప్లిసెస్​, విరాట్​ కోహ్లీ త్వరగా పెవిలియన్​ చేరినప్పటికీ.. దినేశ్​ కార్తీక్​ తనదైన ఆటతో ఆర్​సీబీని విజయ తీరాలకు చేర్చాడని ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్​ ఆర్​సీబీని వదిలి వెళ్లినా అతడి ఆత్మను దినేశ్​ కార్తీక్​లోనే వదిలేసినట్లుగా కనిపిస్తోందన్నాడు. తక్కువ స్కోర్​కే వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడిన ఆర్​సీబీని మ్యాక్స్​వెల్ గట్టెక్కిస్తే.. దినేశ్​ పూర్తి చేశాడని కొనియాడాడు.

టీమిండియాలో కార్తిక్​: 2004లో అరంగేంట్రం చేసిన దినేశ్​ కార్తీక్​ చివరి సారిగా 2019 వన్డే ప్రపంచ కప్​లో టీమిండియా తరఫున ఆడాడు. ఇప్పటి వరకు 36 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచుల్లో పాలుపంచుకున్నాడు.

ఇదీ చూడండి: IPL 2022: దిల్లీపై గెలిచిన బెంగళూరు.. రాణించిన దినేశ్​ కార్తీక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.