ETV Bharat / sports

ఈ ఐపీఎల్​ సీజన్​లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఎలా ఆడారంటే?

10 జట్లతో సరికొత్తగా సాగిన టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ముగిసింది. 'ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్‌ దిగిందా? లేదా?' అనే మహేష్‌బాబు సినిమా డైలాగ్‌లా కొత్తగా లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ అరంగేట్రంలోనే టైటిల్‌ ఎగరేసుకుపోయింది. అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనలకు.. అదరగొట్టే బౌలింగ్‌ దాడులకు.. అబ్బురపరిచే ఫీల్డింగ్‌ విన్యాసాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇక టీమ్‌ఇండియా గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. భారత జట్టు దృక్కోణం చూస్తే ఈ సీజన్‌ మనకు ఇచ్చిందేమిటి?ఉసూరుమనిపించిన అగ్రశ్రేణి ఆటగాళ్లు ఎవరు? ఆశలు రేకెత్తిస్తోన్న యువ క్రికెటర్లు ఎలాంటి ప్రదర్శన చేశారు? తెలుసుకుందాం పదండి.

did-the-2022-ipl-season-help-team-india
ఈ ఐపీఎల్​ సీజన్​లో టీమ్ఇండియా ఆటాగాళ్లు ఎలా ఆడారంటే?
author img

By

Published : May 31, 2022, 7:09 AM IST

Updated : May 31, 2022, 2:23 PM IST

చివరి ఓవర్లో విజయాలు.. పవర్‌ప్లేలోనే వికెట్లు.. శతకాల జోరు.. అద్భుత క్యాచ్‌ల హోరు.. టైటిల్‌ కోసం పోరు.. ఆఖరికి ఓ విజేత. ఇలా రసవత్తరంగా సాగిన 15వ సీజన్‌ అభిమానులకు కిక్కునందించింది. కానీ భారత జట్టు పరంగా చూస్తే మాత్రం పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. టీమ్‌ఇండియా అగ్రశ్రేణి ఆటగాళ్లతో పాటు ఎన్నో అంచనాలతో బరిలో దిగిన కీలక క్రికెటర్లూ పేలవ ప్రదర్శన చేయడమే అందుకు కారణం. అయితే కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు అనూహ్యంగా రాణించడం.. ఎప్పటిలాగే యువ ఆటగాళ్లు తమ సత్తాచాటి భవిష్యత్‌పై ఆశలు కల్పించడం ఊరటనిచ్చే విషయం.

ఏదో అనుకుంటే..

kohli
కోహ్లీ

రోహిత్‌ శర్మ మరోసారి సత్తాచాటి ముంబయిని టైటిల్‌ దిశగా నడిపిస్తాడు.. కెప్టెన్సీ భారం వదిలేసిన కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడు.. టీ20 లీగ్‌తోనే వెలుగులోకి వచ్చిన బుమ్రా మరోసారి ఇదే లీగ్‌తో పునర్వైభవాన్ని అందుకుంటాడు.. ఇలా సీజన్‌ ఆరంభానికి ముందు ఈ ఆటగాళ్ల మీద ఎన్నో అంచనాలు. కానీ పోరు ఆరంభమై.. ఒక్కో మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ ఆ ఆశలన్నీ కూలిపోయాయి. ముఖ్యంగా టీమ్‌ఇండియాకు రెండు ప్రధాన స్తంభాలైన విరాట్‌ (16 మ్యాచ్‌ల్లో 341 పరుగులు), రోహిత్‌ (14 మ్యాచ్‌ల్లో 268) తమ పేలవ బ్యాటింగ్‌తో పూర్తిగా నిరాశపరిచారు.

సీజన్‌లో వీళ్ల ఆట చూస్తే ఔటయేందుకు కొత్త దారులు వెతుక్కున్నట్లు కనిపించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లైన ఈ ఇద్దరూ ఇలాంటి ఆటతీరు కనబరుస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక బౌలింగ్‌ ప్రధానాస్త్రం బుమ్రా (14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు) సాధారణ బౌలర్‌గా మారిపోవడం కలవరపరిచే అంశమే. కోల్‌కతాతో మ్యాచ్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన మినహా అతని బౌలింగ్‌ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించే అతను ఈ సారి వికెట్ల వేటలో విఫలమయ్యాడు. లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (616) గొప్పగా రాణించినా అతని ప్రదర్శన జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వీళ్లు కూడా..

rishabh pant
పంత్​

మెగా వేలంలో అత్యధిక ధర (రూ.15.25 కోట్లు) పలికిన ఇషాన్‌ కిషాన్‌ (418) తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. గత సీజన్లో సంచలన ప్రదర్శనతో తన కోసం ఫ్రాంఛైజీలు పోటీపడేలా చేసిన అతను మైదానంలో మాత్రం పరుగులు రాబట్టడంలో వెనకబడ్డాడు. లీగ్‌ ఆరంభంలో క్రీజులో నిలబడలేక నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. చివర్లో ఫామ్‌ అందుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. రిషబ్‌ పంత్‌ (340) ప్రదర్శన కూడా పడిపోయింది. భారత జట్టుకు ప్రధాన వికెట్‌ కీపర్‌గా ఎదిగిన అతను ఇటీవల ఆటలో పరిణతి సాధించినట్లే కనిపించాడు. కానీ టీ20 లీగ్‌కు వచ్చేసరికి మరోసారి అదే తొందరపాటు, పేలవ షాట్లు, బాధ్యతారాహిత్యంతో విఫలమయ్యాడు. ఇక సీజన్‌ ఆరంభానికి ముందు గాయం నుంచి కోలుకున్న జడేజా టీమ్‌ఇండియా తరపున అదరగొట్టాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సత్తాచాటాడు. కానీ లీగ్‌లో చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడంతో అతని ఆట కనుమరుగైంది. దీంతో మధ్యలోనే పగ్గాలు వదిలేశాడు. మయాంక్‌ (196), వెంకటేశ్‌ అయ్యర్‌ (182), సుందర్‌ (101 పరుగులు, 6 వికెట్లు), భువనేశ్వర్‌ (12 వికెట్లు), సిరాజ్‌ (9) ప్రదర్శన అంతంతమాత్రమే.

సరికొత్త ఆశ..

tilak varma
తిలక్​ వర్మ

ఈ సీజన్‌లోనూ రాణించిన యువ ఆటగాళ్లలో హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ఒకడు. టీ20 లీగ్‌ అరంగేట్ర సీజన్‌లోనే ముంబయి తరపున ఈ 19 ఏళ్ల కుర్రాడు అదరగొట్టాడు. జట్టు విఫలమవుతున్నా తన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 397 పరుగులతో ముంబయి తరపున సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన బ్యాటింగ్‌ శైలి, ఆత్మవిశ్వాసం, కచ్చితత్వంతో కొట్టే షాట్లు చూసి అతను భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు ఆడతాడని మాజీలు చెబుతున్నారు. మరోవైపు బుల్లెట్‌ లాంటి బంతులతో ఉమ్రాన్‌ మాలిక్‌ (22) కట్టిపడేశాడు.

గత సీజన్‌ ఆఖర్లో తన సంచలన వేగంతో వెలుగులోకి వచ్చిన అతణ్ని హైదరాబాద్‌ అట్టిపెట్టుకుంది. దీంతో ఎలాంటి అనుభవం లేని అతణ్ని జట్టుతో ఉంచుకోవడం ఏమిటనే ప్రశ్నలు కానీ తన బౌలింగ్‌తోనే వాటికి అతను సమాధానమిచ్చాడు. నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులేశాడు. ఈ 22 ఏళ్ల కశ్మీర్‌ పేసర్‌ గుజరాత్‌పై చేసిన ప్రదర్శన (5/25) ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేదే. వేగం ఉంది కానీ కచ్చితత్వం లేదంటూ తన బౌలింగ్‌పై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ అతను పుంజుకున్న విధానం అద్భుతం.

ఈ ప్రదర్శనకు మెచ్చిన మాజీలు అతణ్ని ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ లఖ్‌నవూ పేసర్‌ మోసిన్‌ ఖాన్‌ (14) ఆకట్టుకున్నాడు. ఎలిమినేటర్‌లో అజేయ శతకంతో ఒక్కసారిగా బెంగళూరు ఆటగాడు రజత్‌ పటీదర్‌ (333) పేరు మార్మోగింది. కీలక మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో అతను చూపించిన పట్టుదల ప్రశంసలు కురిపించింది. ఇక పేసర్లు ముకేశ్‌ చౌదరి (16), అర్ష్‌దీప్‌ సింగ్‌ (10), యశ్‌ దయాల్‌ (11) కూడా ఆకట్టుకున్నారు.

సత్తా తగ్గలేదని..

టీమ్‌ఇండియాలో చోటు ఇక కష్టమే.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ తట్టుకుని నిలబడడం సవాలే.. ఇక ఈ క్రికెటర్ల పని అయిపోయినట్లే. ఇలా ఐపీఎల్‌కు ముందు కొంతమంది భారత ఆటగాళ్ల భవిష్యత్‌పై ఈ వ్యాఖ్యలు వినిపించాయి. కానీ లీగ్‌ ఆరంభమయ్యాక అనూహ్యంగా ఈ ఆటగాళ్లు చెలరేగారు. తమ సత్తా ఇంకా మిగిలే ఉందని చాటారు.ఇక రిటైర్మెంట్‌ తీసుకోవాల్సిందేనన్న సూచనలు అందుకున్న సాహా (317) ఈ సీజన్‌లో ఆలస్యంగా జట్టులోకి వచ్చినా అదరగొట్టాడు. శుభ్‌మన్‌తో కలిసి గుజరాత్‌కు శుభారంభాలు అందించి జట్టు టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ (330) తనలోని మరో అవతారాన్ని చూపించాడు. ఫినిషర్‌గా ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అలరించాడు. జట్టులోకి వస్తూ పోతూ ఉన్న ఉమేశ్‌ (16) ఈ సీజన్‌లో తనను తాను కొత్తగా మార్చుకున్నాడు. పవర్‌ప్లేలో పదునైన బంతులతో వికెట్లు కూల్చాడు. ఇక అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన చాహల్‌ (27) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజస్థాన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

హార్దిక్‌.. తన కెరీర్‌ ఆరంభంలో ఈ పేరు ఎక్కువగా మార్మోగింది. కానీ 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతని లయ దెబ్బతింది. జట్టులో స్థానం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (487 పరుగులు, 8 వికెట్లు)తో అదరగొట్టిన అతను జట్టుకు టైటిల్‌ అందించాడు. అందరూ తన పేరును మర్చిపోతున్న తరుణంలో కుల్‌దీప్‌ యాదవ్‌ (21 వికెటు) ఈ సీజన్‌లో రెచ్చిపోయాడు. సీనియర్‌ ఓపెనర్‌ ధావన్‌ (460 పరుగులు) పంజాబ్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇదీ చదవండి: బీసీసీఐ పెద్ద మనసు.. క్యురేటర్స్​, గ్రౌండ్స్​మెన్​కు ప్రైజ్​మనీ

Last Updated : May 31, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.