ETV Bharat / sports

MS Dhoni IPL: చెన్నైలోనే ధోనీ వీడ్కోలు మ్యాచ్‌! - Dhoni IPL retirement

తన ఐపీఎల్​ రిటైర్మెంట్​పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు​ చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీ(MS Dhoni IPL). వచ్చే సీజన్​లో ఆడతానని స్పష్టం చేశాడు. తన వీడ్కోలు మ్యాచ్​ చెన్నై స్టేడియంలోనే ఉంటుందని చెప్పాడు.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Oct 6, 2021, 6:29 AM IST

Updated : Oct 6, 2021, 6:53 AM IST

ధోనీ(Dhoni retirement) అభిమానులకు శుభవార్త. ఈ దిగ్గజ ఆటగాడు మరో ఐపీఎల్‌ సీజన్‌ ఆడబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహి(MS Dhoni IPL).. ఈ ఏడాది టోర్నీతోనే ముగిస్తాడా అన్న అనుమానాలకు తెరదించుతూ వచ్చే సీజన్లో(Dhoni IPL 2021) తనను చూస్తారని.. తన వీడ్కోలు మ్యాచ్‌ ప్రియతమ చెన్నై స్టేడియంలోనే ఉంటుందని అతడు స్పష్టం చేశాడు. మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో అభిమానులతో మాట్లాడుతూ అతడిలా అన్నాడు.

"వీడ్కోలు మాటకు వచ్చేసరికి అది చెన్నైలోనే ఉంటుంది. ఘనంగా నన్ను సాగనంపేందుకు మీకు ఓ అవకాశం లభిస్తుంది. వచ్చే సీజన్లో చెన్నై వచ్చి నా చివరి మ్యాచ్‌లో అభిమానులను కలుసుకుంటానని ఆశిస్తున్నా" అని ధోనీ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి 'ఆగస్టు 15'ను మించిన రోజు మరొకటి తనకు కనిపించలేదని.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహి సమాధానంగా చెప్పాడు. వచ్చే ఐపీఎల్‌ మెగా వేలంలో చెన్నై జట్టు ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌లను తిరిగి దక్కించుకోనున్నట్లు తెలిసింది.

2020, 2021 ఐపీఎల్‌ సీజన్లు యూఏఈలోనే జరగడంతో 2019 నుంచి మహి మళ్లీ చెన్నైలోకి ఆడలేదు. ఈ ఏడాది టోర్నీ తొలి అంచెలో చెన్నై జట్టు ముంబయి కేంద్రంగానే మ్యాచ్‌లు ఆడింది.

ఇదీ చదవండి:

ఇంగ్లాండ్​కు షాక్​.. ప్రపంచకప్​కు స్టార్​ ఆల్​రౌండర్​ దూరం

Last Updated : Oct 6, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.