ETV Bharat / sports

వీరబాదుడుతో గేరు మార్చిన ధావన్ - Dhawan is aiming for a place in the short World Cup

కుర్రాళ్ల జోరు ముందు ఇక ధావన్​ ఎంతో కాలం టీమ్​ఇండియాలో కొనసాగలేడనుకున్నారు. బ్యాటింగ్​లో నిలకడలేమి, ఫిట్​నెస్​ సమస్యలకు తోడు వయసు సమస్యలు అతడికి ప్రతికూలతలుగా కనిపించాయి. కానీ, గతేడాది ఐపీఎల్​ నుంచి శిఖర్​.. గేర్​ మార్చాడు. తన సత్తా ఎంటో చూపిస్తూ.. పొట్టి ప్రపంచకప్​ రేసులో తానూ ఉన్నానని చాటి చెబుతున్నాడు.

shikhar dhawan, delhi capitals
శిఖర్ ధావన్, దిల్లీ క్యాపిటల్స్
author img

By

Published : Apr 21, 2021, 8:55 AM IST

గతేడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ పనైపోయిందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. బ్యాటింగ్​లో నిలకడ లేమి, ఫిట్​నెస్ సమస్యలకు తోడు వయసు పెరిగిపోవడం అతడికి ప్రతికూలతలుగా కనిపించాయి. కుర్రాళ్ల జోరు ముందు అతను నిలవలేడని, టీమ్​ఇండియాలో చోటు నిలుపుకోవడం కష్టమే అని తేల్చేశారు చాలామంది. కానీ యూఏఈలో జరిగిన ఐపీఎల్​లో ఈ సీనియర్ ఓపెనర్ చెలరేగిపోయాడు. ఒకటికి రెండు శతకాలు బాదేశాడు. మొత్తం 618 పరుగులతో ఆ ఐపీఎల్ టాప్​స్కోరర్లలో రెండో స్థానం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి సెలక్టర్లకు కల్పించాడతను. ఆ పర్యటనలో ఓ మోస్తరు ప్రదర్శన చేసిన ధావన్​పై స్వదేశంలో ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో జట్టు యాజమాన్యం శీతకన్నేసింది.

ఒక మ్యాచ్​లో ఆడించి పక్కన పెట్టేసింది. అయితేనేం ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో అతను అదరగొట్టాడు. ఒక మ్యాచ్​లో 98 పరుగులు, మరో మ్యాచ్​లో 67 పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 జట్టులో అతడికి స్థానం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో సూర్యకుమార్, కిషన్ లాంటి కుర్రాళ్ల జోరు చూస్తే భారత జట్టు టీ20 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి ధావన్​ను తప్పించడం ఖాయమనే అనిపించింది. కానీ ఇప్పుడు ఐపీఎల్​లో ధావన్ చెలరేగుతున్న తీరు చూస్తే.. అతను అంత తేలిగ్గా తన స్థానాన్ని వదిలేలా లేడు. ఆడిన తొలి మ్యాచ్​లోనే (చెన్నైపై) 85 పరుగులు చేసిన ధావన్.. చెన్నైతో గత మ్యాచ్​లో 92 పరుగులు సాధించడం విశేషం.

ఇదీ చదవండి: చెన్నై జోరును కోల్​కతా నిలువరించేనా?

ఈ రెండు మ్యాచ్​ల్లో విధ్వంసక బ్యాటింగ్​తో ఆకట్టుకున్న ధావన్.. ముంబయితో బుధవారం బ్యాటింగ్ ఎంతో కఠినంగా సాగిన మ్యాచ్​లో తన శైలికి భిన్నంగా ఆడాడు. అతను చూపించిన పట్టుదల అసామాన్యం. ఎప్పుడూ దూకుడుగా ఆడే శిఖర్.. పరిస్థితులకు తగ్గట్లుగా ఓపికతో ఆడాడు. సంయమనం కోల్పోలేదు. ప్రతి పరుగుకూ శ్రమించాడు. వీలు చిక్కినపుడు షాట్లు కొట్టాడు. జట్టు మెరుగైన స్థితికి చేరాక చకచకా మ్యాచ్​ను ముగిద్దామని దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఔటయ్యాడు. మ్యాచ్​ ముగించకపోయినా.. దిల్లీ విజయంలో అతడి పాత్ర కీలకం. చేసింది 45 పరుగులే అయినా ఇంతకుముందు ఆడిన పెద్ద ఇన్నింగ్స్​లకు ఏమాత్రం తీసిపోని, విలువైన ఇన్నింగ్స్ ఇది. ధావన్ జోరు చూస్తుంటే.. టీ20 ప్రపంచకప్ రేసులో నేనున్నా అని చాటుతున్నట్లే ఉంది.

ఇదీ చదవండి: 'దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో జోక్యం చేసుకోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.