ETV Bharat / sports

David Warner: వార్నర్ అరుదైన రికార్డు.. రోహిత్​ తర్వాత అతడే - రోహిత్ శర్మ

David Warner: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఒకే జట్టుపై వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా ఘనత దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ముంబయి సారథి రోహిత్ శర్మ అతడి కన్నా ముందున్నాడు.

David Warner
IPL 2022
author img

By

Published : Apr 21, 2022, 9:05 AM IST

David Warner: ఐపీఎల్​లో ఒక ఫ్రాంఛైజీపై వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు డేవిడ్ వార్నర్. ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్ శర్మ అనంతరం ఈ ఘనత సాధించింది వార్నర్ మాత్రమే. బుధవారం పంజాబ్​తో మ్యాచ్​ సందర్భంగా ఆ జట్టుపై 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు ఈ దిల్లీ ఓపెనర్.

David Warner
వార్నర్, పంత్

కోల్​కతా నైట్​రైడర్స్​పై 1018 పరుగులు చేసి, ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు రోహిత్. ఇక పంజాబ్​తో మ్యాచ్​లో 30 బంతుల్లోనే 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు వార్నర్. ఈ మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో దిల్లీ గెలుపొందింది.

ఇదీ చూడండి: బ్యాటింగ్, బౌలింగ్​లో దిల్లీ భళా.. పంజాబ్ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.