ETV Bharat / sports

CSK vs DC: ఉత్కంఠ పోరులో విజయం.. ఫైనల్​కు సీఎస్కే - సీఎస్​కే

దుబాయ్​ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో దిల్లీపై చెన్నై విజయం సాధించింది. దీంతో సీఎస్కే ఫైనల్​కు దూసుకెళ్లింది.

CSK vs DC
గైక్వాడ్​- ఉతప్ప కీలక భాగస్వామ్యం
author img

By

Published : Oct 10, 2021, 11:19 PM IST

Updated : Oct 11, 2021, 11:56 AM IST

ఐపీఎల్​-2021లో ఫైనల్​కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్​ కింగ్స్​ నిలిచింది. ఆదివారం దుబాయ్​ వేదికగా దిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో​ చెన్నై ఘన విజయం సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని(173) ఉత్కంఠపోరులో ఛేదించింది. దిల్లీ బౌలర్లను ఉతప్ప(63) ఉతికారేశాడు. అతడికి గైక్వాడ్​(70) తోడవడం వల్ల విజయం చెన్నైను వరించింది. చివరిలో వచ్చి తనదైన శైలిలో మంచి ఫినిషింగ్​ ఇచ్చి.. జట్టును ఫైనల్​కు తీసుకెళ్లాడు ధోనీ.

ధనాధన్​ ఉతప్ప..

173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్​లోనే.. ఓపెనర్​ డుప్లెసిస్​ రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. నోర్ట్జే బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సమయంలో అభిమానులు రుతురాజ్​ గైక్వాడ్​పై ఆశలు పెట్టుకున్నారు. సీజన్​ మొత్తంలో గైక్వాడ్​ అద్భుతంగా ఆడాడు. అయితే ఇక్కడే ఉతప్ప మాయచేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదేసి.. దిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచేడు. మరో ఎండ్​లో గైక్వాడ్​.. ఉతప్పకు మంచి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే ఉతప్ప అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అప్పటికి సీఎస్కే స్కోరు 81/1.

టామ్​ కరెన్​ 'మలుపు' తిప్పేశాడు..

ఆ తర్వాత కొద్ది సేపు ఇద్దరు వెనుదిరిగి చూడలేదు. దిల్లీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఆశ్విన్​ బౌలింగ్​లో ఉతప్ప కొట్టిన రివర్స్​ స్వీప్​.. ఇన్నింగ్స్​కే హైలైట్​ అని చెప్పుకోవాలి. అదే ఊపు మీద టామ్​ కరెన్​ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు ఉతప్ప. బౌండరీ వద్ద శ్రేయస్​ అయ్యర్​ అద్భుత క్యాచ్​ అందుకున్నాడు. ఉతప్ప ఔట్​ అయినా.. గైక్వాడ్​ దూకుడు కొనసాగించాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఉతప్ప ఔట్​ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్​ను టామ్​ కరెన్​ డకౌట్​ చేశాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు(1) పెద్దగా ప్రభావం చూపించలేదు. రబాడ బౌలింగ్​లో శ్రేయర్​ అయ్యర్​.. రాయుడిని రనౌట్​ చేశాడు.

ధోనీ మాయ..

రాయుడు ఔటైన తర్వాత క్రీజ్​లోకి వచ్చాడు ధోనీ. అప్పటికే మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆవేశ్ ఖాన్​ వేసిన 19 ఓవర్​ చివర్లో సిక్స్​ కొట్టి కాస్త టెన్షన్​ను తగ్గించాడు. 20వ ఓవర్​ మొదట్లో.. అలీని ఔట్ చేశాడు టామ్​ కరన్​. అప్పుడు క్రీజ్​లోకి వచ్చిన ధోనీ.. ఎప్పటిలాగే బెస్ట్​ ఫినిషింగ్​ ఇచ్చాడు. చివరి ఓవర్​లో మూడు ఫోర్లు కొట్టి.. రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

తొలి ఇన్నింగ్స్​ ఇలా..

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది. పృథ్వీ షా(60), పంత్​(51*), హెట్​మయర్​(37) రాణించారు. పంత్​-హెట్​మయర్​ భాగస్వామ్యం(83) ఆ ఇన్నింగ్స్​కు హైలైట్​గా నిలిచింది.

తొలి ఇన్నింగ్స్​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Oct 11, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.