14వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. కొవిడ్ దృష్ట్యా గత ఐపీఎల్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించారు. కాగా, ఈ పొట్టి ఫార్మాట్ ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యలో జరుగనుంది.
కొవిడ్ తర్వాత గత కొద్ది రోజులుగా పరిస్థితులు మారుతున్నాయి. 2021 ఐపీఎల్ భారత్ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను తప్పనిసరిగా అనుమతిస్తాము. ఫిబ్రవరి 18న వేలం జరుగుతుంది. తదుపరి తేదీలు, వేదికలను ప్రకటిస్తాం.
-బీసీసీఐ అధికారి.
ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత మైదానంలోకి 50 శాతం ప్రేక్షకులను రానివ్వడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ ఆసాంతం అంతా సవ్యంగా జరిగితే ఐపీఎల్‌కు కూడా వీక్షకులను అనుమతిస్తామని బోర్డు అధికారి తెలిపారు.
ప్రతి ఫ్రాంచైజీ తమ హోం గ్రౌండ్లో మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా అదనంగా రూ.25-40 కోట్లు ఆర్జించేవి. అభిమానులు లేకుండా నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్లో ఈ మొత్తాన్ని ఫ్రాంచైజీలు కోల్పోయాయి.
ఇదీ చదవండి: యువరాజ్ సింగ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?