ETV Bharat / sports

'ఐపీఎల్​లోనూ దేశవాళీ ఫామ్​ను కొనసాగిస్తా' - ఐపీఎల్​ 2021

ఐపీఎల్​లో ఆడటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని తెలిపాడు ఆర్సీబీ ఆటగాడు దేవ్​దత్​ పడిక్కల్​. దేశవాళీలో కొనసాగించిన ఫామ్​ను ప్రస్తుత సీజన్​లోనూ కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కొవిడ్ ఒక ఎదురుదెబ్బ అని.. ఇప్పడు దాని నుంచి పూర్తిగా కోలుకున్నట్లు పేర్కొన్నాడు.

Confident Padikkal wants to take domestic form into IPL 2021
'ఐపీఎల్​లోనూ దేశవాళీ ఫామ్​ను కొనసాగిస్తా'
author img

By

Published : Apr 12, 2021, 12:39 PM IST

ఐపీఎల్​లో ఆడటానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు బెంగుళూరు ఓపెనర్​ దేవ్​దత్​ పడిక్కల్​. దేశవాళీ ఫామ్​ను ప్రస్తుత లీగ్​లోనూ కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్చి 22న కరోనా బారిన పడిన పడిక్కల్​.. సీజన్​ ప్రారంభానికి ముందు కోలుకున్నాడు. ఇటీవల తన సహచరులతో కలిసి సాధన కూడా మొదలెట్టాడు.

"కొవిడ్ అనేది ఒక ఎదురుదెబ్బ. అది రాలేదనే అనుకుంటున్నా. కానీ, దాని నుంచి బయటపడలేకపోయాను. నన్ను నేను ఫిట్​గా ఉంచుకున్నాను. తిరిగి జట్టుతో కలిశాను. ఇప్పుడు లీగ్​లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం నేను పూర్తి స్థాయిలో బాగున్నాను. బంతులను ఎదుర్కోగలుగుతున్నా. ఇది చాలా ముఖ్యమైనది. ప్రధానంగా ఐపీఎల్​లో 100 శాతం సన్నద్ధంగా ఉండాలి. లేకుంటే మనల్ని మనం నిరూపించుకోలేము" అని పడిక్కల్ ఆర్సీబీ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసుకున్నాడు.

ఇదీ చదవండి: నా ఫామ్ వెనుక కారణం అదే: పృథ్వీ షా

గతమెంతో ఘనం..

గత ఐపీఎల్​ సీజన్​తో పాటు సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ(6 మ్యాచ్​ల్లో 43.60 సగటుతో 218 పరుగులు), విజయ్​ హజారే ట్రోఫీ(7 మ్యాచ్​ల్లో 737 రన్స్​)లో మంచి ప్రదర్శన చేశానని పడిక్కల్​ తెలిపాడు. అదే ఫామ్​ను ప్రస్తుత సీజన్​లోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాను బరిలోకి దిగిన ప్రతిసారి బ్యాటింగ్​ పరంగా మెరుగవుతూనే ఉంటానని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: 'విలయమ్సన్​కు ఇంకా సమయం పడుతుంది'

ముంబయితో తొలి మ్యాచ్​లో స్థానం కోల్పోయిన పడిక్కల్​ ఏప్రిల్​ 18న జరిగే కోల్​కతాతో మ్యాచ్​ కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాడు. అవకాశం వస్తే విరాట్​తో కలిసి ఇన్నింగ్స్​ ఓపెన్​ చేయడానికి సిద్ధమని తెలిపాడు. సీనియర్లతో కలిసి బ్యాటింగ్​ చేయడం వల్ల తన పని సులువు అవుతుందని చెప్పాడు. వారి నుంచి వీలైనంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని వెల్లడించాడు.

కొవిడ్ కారణంగా ప్రస్తుత సీజన్​కు అభిమానులను అనుమతించలేదు బీసీసీఐ. అయితే త్వరలోనే మంచి రోజులు వస్తాయని.. ప్రేక్షకులు తిరిగి స్టేడియాలకు రావాలని కోరుకుంటున్నట్లు పడిక్కల్​ తెలిపాడు.

ఇదీ చదవండి: 'ఫిట్​నెస్​తో శారీరక, మానసిక సమస్యలకు చెక్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.