ETV Bharat / sports

ముంబయి Vs కోల్​కతా: రెండో మ్యాచ్​లో గెలుపెవరిది?

చెన్నై వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​​, ముంబయి ఇండియన్స్​​ మధ్య మ్యాచ్​ జరగనుంది. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఇరుజట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో? ఏ జట్టులో ఎన్ని మార్పులు జరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం.

Clinical KKR hope to get it right against nemesis MI
ముంబయి Vs కోల్​కతా
author img

By

Published : Apr 13, 2021, 5:32 AM IST

ఐపీఎల్​లో మంగళవారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​లో ​కోల్​కతా నైట్​రైడర్స్​తో ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. ఆదివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలుపుతో జోష్​లో ఉన్న మోర్గాన్​ సేన.. తమ రెండో మ్యాచ్​లోనూ అదే ఉత్సాహంతో విజయాన్ని దక్కించుకోవాలని సన్నాహాలు చేస్తోంది. అదే విధంగా తొలి మ్యాచ్​లో ఆర్సీబీపై ఓడిన రోహిత్​ సేన.. ఈ మ్యాచ్​లో విజేతగా నిలిచి పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల గురించి ఓసారి పరిశీలిద్దాం.

జోరు కొనసాగించేనా?

ఆదివారం టోర్నీలో సన్​రైజర్స్ హైదరాబాద్​తో కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడింది. ఈ మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​పై 10 పరుగుల తేడాతో కేకేఆర్​ నెగ్గింది. ఇందులో ​కోల్​కతా ఓపెనర్​​ నితీశ్​ రానా అద్భుత ప్రదర్శన చేయగా.. శుభ్​మన్​ గిల్​ ఫర్వాలేదనిపించాడు. మరో యువబ్యాట్స్​మన్​ రాహుల్​ త్రిపాఠి అర్ధశతకంతో అలరించగా.. మిగిలిన వారంతా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు.

బౌలింగ్​ లైనప్​లో ప్రసిద్ధ్​ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. షకిబుల్​ హసన్​, పాట్​ కమిన్స్​, అండ్రూ రస్సెల్​ చెరో వికెట్​ సాధించారు. గత మ్యాచ్​ గెలిచిన క్రమంలో ప్రస్తుత జట్టులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ సునీల్​ నరైన్​కు జట్టులో చోటు కల్పించాలని నిర్ణయిస్తే.. ఓ యువ ఆటగాడి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

రెండో మ్యాచ్​లోనైనా..

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​ ప్రారంభ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్​ జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్​లో చివరి వరకు విజయం కోసం పోరాడిన రోహిత్​ సేనకు నిరాశే మిగిలింది. కానీ, ఈ సీజన్​లో జట్టులోకి అరంగేట్రం చేసిన క్రిస్​ లీన్ అద్భుతమైన బ్యాటింగ్ ముంబయికి భవిష్యత్​ మ్యాచ్​ల్లో కలిసొస్తుందనే చెప్పాలి. టాప్​ఆర్డర్​లో రోహిత్​ శర్మతో క్రిస్​ లీన్​ ఉండగా.. మిడిల్​ ఆర్డర్​లో సూర్య కుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, పాండ్య సోదరులు ఉన్నారు.

బౌలింగ్​ లైనప్​లో బుమ్రా, బౌల్ట్​తో పాటు రాహుల్​ చాహర్​, క్రునాల్​ పాండ్య వంటి స్పిన్నర్లూ ఉన్నారు. కోల్​కతాతో జరిగే మ్యాచ్​లో డికాక్​ క్వారంటైన్​ పూర్తి అయితే జట్టులో మార్పు జరిగే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)​:

కోల్​కతా నైట్​రైడర్స్​: ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), దినేశ్​ కార్తిక్​ (వికెట్​ కీపర్​), శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రానా, అండ్రూ రస్సెల్​, కుల్దీప్​ యాదవ్​, పాట్​ కమిన్స్​, ప్రసిద్ధ్​ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్​ చక్రవర్తి, షకిబ్​ అల్​ హసన్​. (సునీల్​ నరైన్​కు ఈసారి ఆడే అవకాశం రావొచ్చు)

ముంబయి ఇండియన్స్​: రోహిత్​ శర్మ (కెప్టెన్​), సూర్యకుమార్ ​యాదవ్​, క్రిస్​ లీన్​, జస్​ప్రీత్​ బుమ్రా, రాహుల్​ చాహర్​, ట్రెంట్​ బౌల్ట్​, హార్దిక్ పాండ్య, క్రునాల్​ పాండ్య, ఇషాన్​ కిషన్​, క్వింటన్ డికాక్​ (వికెట్​ కీపర్​), మార్కో జన్​సెన్​.

ఇదీ చూడండి: సన్​రైజర్స్​పై కోల్​కతా నైట్​రైడర్స్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.