ముంబయి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 రన్స్‌కే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ జట్టుపై 45 పరుగుల తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది ధోనీసేన. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్(49) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. సీఎస్కే స్పిన్నర్ మొయిన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్, జడేజా చెరో 2 వికెట్లను సాధించి, జట్టు గెలుపులో భాగమ్యయ్యారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. మధ్యలో చేతన్ సకారియా 3/36 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, చెన్నై జట్టులో ఎవరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా తలా వీలైనన్ని పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
సీఎస్కే బ్యాట్స్‌మెన్.. డుప్లెసిస్(33), మొయిన్ అలీ(26), అంబటి రాయుడు(27), సురేశ్ రైనా(18), ధోనీ(18), బ్రావో(20నాటౌట్; 8 బంతుల్లో 2x4, 1x6) ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలు బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో సకారియా 3, మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1, రాహుల్ తెవాతియా 1 వికెట్ తీశారు.
ఇదీ చూడండి: సీఎస్కే సమష్టి కృషి.. రాజస్థాన్ లక్ష్యం 189