ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​లో ఎయిర్​ అంబులెన్స్​- 30 వేల RT-PCR​ కిట్లు

ఐపీఎల్​(IPL 2021) రెండోదశలో క్రికెటర్లతో పాటు మెడికల్​ సిబ్బందిని బయోబబుల్​లో(IPL Bio Bubble) చేర్చనుంది భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI IPL). దీంతో పాటు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసేందుకు గానూ.. 30 వేల ఆర్​టీ-పీసీఆర్​ కిట్లను(RT-PCR Test) అందుబాటులో ఉంచనున్నారు.

BCCI to facilitate 30,000 RT-PCR tests during IPL 2nd phase, medical staff to stay in same bubble
ఐపీఎల్​లో ఎయిర్​ అంబులెన్స్​- 30 వేల ఆర్​టీ-పీసీఆర్​ కిట్లు
author img

By

Published : Sep 8, 2021, 8:46 PM IST

ఐపీఎల్​(IPL 2021) బయోబబుల్​లో ఆటగాళ్లతో పాటు ఈసారి 100 మంది మెడికల్​ సిబ్బంది కూడా చేరనున్నారు. సెప్టెంబరు 19 నుంచి రెండోదశ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్​లు చేసేందుకుగానూ దుబాయ్​లోని ఓ మెడికల్​ సర్వీస్​ ప్రొవైడర్​తో బీసీసీఐ(BCCI IPL) కాంట్రాక్ట్​ కుదుర్చుకుంది. 31 మ్యాచ్​లు జరగనున్న ఈ దశలో దాదాపుగా 30 వేల ఆర్టీపీసీఆర్​ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు.

క్రికెటర్లకు అత్యవసర వైద్యం కోసం బయోబబుల్​(IPL Bio Bubble) నుంచి బయటకు వెళ్లాల్సిన పని లేకుండా.. వైద్య సిబ్బందినీ బయోబబుల్​లో భాగం చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. వారందరికీ హోటల్​ సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఆటగాళ్ల కోసం ఎయిర్​ అంబులెన్స్​ సదుపాయాన్ని స్టేడియాల్లో కల్పించనున్నారు.

మూడు రోజులకు ఒకసారి..

ఈ బయోబబుల్​లో ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​లను(RT-PCR Test) నిర్వహించనున్నారు. గతంలో ఐదు రోజులకు ఒకసారి ఈ పరీక్షలను జరపగా.. ఇప్పుడు వాటిని మూడు రోజులకు కుదించారు.

రెండు బృందాలుగా..

మ్యాచ్​ జరిగే ప్రతి స్టేడియం వద్ద రెండు మెడికల్​ బృందాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. అందులో డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్​, లాబోరెటరీ టెక్నిషియన్స్​ ఉంటారు.

హోటల్​ సిబ్బందికి పరీక్షలు

ఐపీఎల్​లో పాల్గొనేందుకు క్రికెటర్లందరూ యూఏఈ చేరుకునే ముందుగా.. దుబాయ్​, అబుదాబిలో ఆతిథ్యం ఇవ్వనున్న 14 హోటళ్లలో ఉన్న 750 మంది సిబ్బందికి కరోనా టెస్ట్​ చేయనున్నారు.

ఇదీ చూడండి.. డోపింగ్​కు​ పాల్పడినా జాతీయ అవార్డులకు అర్హులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.