టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబంలో పది మందికి కరోనా సోకినట్లు అతడి భార్య ప్రీతి శుక్రవారం వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో తన కుటుంబానికి అండగా ఉండటం కోసం దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు.
"ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్లకు, నలుగురు పిల్లలకు పాజిటివ్‌గా తేలింది. పిల్లల కారణంగా అందరికీ వైరస్ అంటుకుంది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడం వల్ల గతవారం ఓ పీడకలలా గడిచింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి" అని ప్రీతి ట్వీట్లలో పేర్కొంది.