ETV Bharat / sports

IPL-RCB: ఈ ఐదుగురూ ఆర్సీబీ ఆటగాళ్లే.. ఇది మీకు తెలుసా? - ipl 2021 winner RCB

ఇప్పుడు స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు.. గతంలో ఆర్సీబీకి ఆడారని మీకు తెలుసా? మరో విషయమేమిటంటే వాళ్లకు అప్పుడు మ్యాచ్​ ఆడే అవకాశమే రాలేదంటే నమ్మగలరా? ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? ఏ సీజన్​లో ఆడారు?

IPL-RCB
కోహ్లీ ఆర్సీబీ
author img

By

Published : Jun 1, 2021, 9:31 AM IST

ఐపీఎల్​లో(IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అనగానే మనకు కోహ్లీ(Kohli), ఏబీ డివిలియర్స్(De villiers) మనకు గుర్తొస్తారు. ఈ సీజన్​లో మ్యాక్స్​వెల్ కూడా రావడం వల్ల బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. అయితే స్టార్ క్రికెటర్లు స్మిత్, మోర్గాన్, భువనేశ్వర్ కుమార్ తదితరులు ఈ జట్టుకు ఆడారని మీకు తెలుసా? ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి.

స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్.. లెగ్ స్పిన్నర్​గా తన కెరీర్​ మొదలుపెట్టాడు. 2010లో జెస్సీ రైడర్​కు ప్రత్యామ్నయంగా ఆర్సీబీ ఇతడిని ఎంపిక చేసుకుంది. కానీ ఆ సీజన్​లో స్మిత్​కు ఆడే అవకాశం రాలేదు. 2011లో మెగా వేలానికి ముందు ఇతడిని బెంగళూరు జట్టు వదిలేసుకుంది. ఆ తర్వాత ఏడాది కొచి టస్కర్స్ జట్టులోకి వచ్చినా మ్యాచ్​లు ఆడలేకపోయాడు. ఎట్టకేలకు 2012లో పుణె వారియర్స్ తరఫున స్మిత్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం దిల్లీ తరఫున ఆడుతున్నాడు.

smith RCB
స్టీవ్ స్మిత్

ఇయాన్ మోర్గాన్

ఇంగ్లాండ్ ప్రముఖ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్.. 2010లో ఆర్సీబీలోకి వచ్చాడు. స్మిత్​లా కాకుండా ఆ సీజన్​లో ఇతడు ఆరు మ్యాచ్​లాడి కేవలం 35 పరుగులే చేశాడు. దీంతో మోర్గాన్​ను బెంగళూరు జట్టు విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్​కతా జట్టులో ఉన్నాడు.

Eion morgan RCB
ఇయాన్ మోర్గాన్

భువనేశ్వర్ కుమార్

2009 నుంచి రెండేళ్లపాటు బెంగళూరు జట్టులో ఉన్నప్పటికీ బౌలర్ భువనేశ్వర్ కుమార్​కు ఆడే అవకాశం రాలేదు. 2011లో పుణె వారియర్స్ తరఫున అరంగేట్రం చేశాడు ఈ పేసర్. ప్రస్తుతం సన్​రైజర్స్ హైదరాబాద్​లో కీలక బౌలర్​గా కొనసాగుతున్నాడు.

BHUVI RCB
భువనేశ్వర్ కుమార్

సునీల్ జోషి

ప్రస్తుతం టీమ్​ఇండియా సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సునీల్ జోషి.. 2008లో కోహ్లీతో కలిసి ఆర్సీబీ డ్రస్సింగ్ రూమ్​ను పంచుకున్నాడు. ఆ సీజన్​లో నాలుగే మ్యాచ్​లు ఆడిన సునీల్.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఆ తర్వాత ఆడే అవకాశమే రాలేదు.

sunil JOSHI RCB
సునీల్ జోషి

మిస్బా ఉల్ హక్

పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్.. ఐపీఎల్ ప్రారంభ సీజన్​ మాత్రమే ఆడాడు. ఆర్సీబీ తరఫున ద్రవిడ్ కెప్టెన్సీలో 8 మ్యాచ్​ల్లో పాల్గొన్నాడు. ఆ సీజన్​లో 117 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాది నుంచి పాక్ క్రికెటర్లు ఎవరూ ఈ లీగ్​లో ఆడటం లేదు.

misbah RCB
మిస్బా ఉల్ హక్

ఐపీఎల్​ మొదలైనప్పటి నుంచి బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ.. లీగ్​ మొత్తంలో ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుత సీజన్​ కరోనా కారణంగా వాయిదా పడింది. లేదంటే ఈసారి ఫామ్​ను చూస్తుంటే కప్ కొట్టేసేదని ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు. సెప్టెంబరులో యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్​లు జరగనున్నాయి. మరి బెంగళూరు జట్టు ఏం చేస్తుందో చూడాలి?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.