ETV Bharat / sports

ఫేమస్​ క్రికెటర్లే.. ఐపీఎల్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేకపోయారు! - ipl players

Famous Players Never Played IPL: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ఎందరినో స్టార్లను చేసింది. భారత్​లో ఎందరో వర్ధమాన క్రికెటర్లను జాతీయ జట్టు తలుపుతట్టేలా చేసింది. విదేశీ క్రికెటర్లలోనూ ప్రతిభను ప్రపంచానికి చాటింది. అయితే ఆయా దేశాల తరఫున అద్భుతంగా రాణించిన కొందరు అసలు ఐపీఎల్​ ఆడలేకపోయారు. వారెవరో చూద్దాం.

4 famous players who have never played in the IPL

author img

By

Published : Apr 9, 2022, 4:15 PM IST

Famous Players Never Played IPL: ఐపీఎల్​.. దాదాపు 2-3 నెలలపాటు సాగే ఈ టోర్నీ అంటే క్రికెట్​ అభిమానులకు పండగే. చెలరేగిపోయే బ్యాటర్లు.. వికెట్ల వేటలో బౌలర్లు.. ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు.. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలాంటి లీగ్​లో ఆడాలని, అద్భుత ప్రదర్శనతో కోట్లు కొల్లగొట్టాలని ప్రతీ క్రికెటర్​ కలలుగంటాడు. ఈ టోర్నీ 2008లో మొదలైనా.. భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్ సహా రాహుల్​ ద్రవిడ్​, కుంబ్లే, లక్ష్మణ్​, గంగూలీ వంటి మాజీలు వారు రిటైరైన తర్వాత కూడా ఐపీఎల్​ ఆడారు. విదేశీయుల్లో రికీ పాంటింగ్​, సైమండ్స్​, గిబ్స్​, ఆమ్లా, జయసూర్య, జయవర్ధనే ఇలా ఎందరో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అలరించారు. అయితే.. ఒకప్పుడు ఆయా దేశాల తరఫున అద్భుత ప్రదర్శన చేసిన పలువురు స్టార్​ ఆటగాళ్లు ఐపీఎల్​లో ఒక్కసారి కూడా ఆడలేకపోయారు. వారెవరో ఓసారి చూద్దాం.

1. జో రూట్​

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లలో జో రూట్​ ముందువరుసలో ఉంటాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ.. ఇంగ్లాండ్​ సారథి ఐపీఎల్​కు ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. టెస్టులు, వన్డేల్లో వేలకొద్దీ పరుగులు చేసిన రూట్​.. 32 టీ20ల్లో 35 సగటుతో 893 రన్స్​ మాత్రమే చేశాడు. స్ట్రైక్​ రేటు 126గానే ఉంది. అత్యధిక స్కోరు 90. అయితే గతంలో ఐపీఎల్​కు ఆడాలని రూట్​ పలుమార్లు అనుకున్నా.. నిరాశే ఎదురైంది. కొన్ని సార్లు అతడిపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోడవం, మరికొన్నిసార్లు ఇంగ్లాండ్​ బోర్డు ఒప్పుకోకపోవడం వల్ల అతడికి నిరాశ ఎదురైంది. అయితే.. టీ20ల్లో రూట్​ దూకుడుగా ఆడలేడని క్రికెట్​ విమర్శకుల అభిప్రాయం. మరి తన కెరీర్​ ముగిసేలోపు ఐపీఎల్​ అరంగేట్రం చేస్తాడో చూడాలి.

4 famous players who have never played in the IPL
జో రూట్​

2. దినేష్​ రామ్​దిన్​

వెస్టిండీస్​ తరఫున 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ-20లు ఆడిన ఘనత దినేశ్​ రామ్​దిన్​ది. 3 ఫార్మాట్లలో బాగా రాణించలేకపోయినా.. సుదీర్ఘకాలం విండీస్​కు ఆడాడు ఈ వికెట్​కీపర్​ బ్యాటర్​. దాదాపు 6 వేలకుపైగా పరుగులు చేసిన ఈ విండీస్​ ఆటగాడు.. ఐపీఎల్​కు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. 2012,2016లో విండీస్​ టీ-20 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో రామ్​దిన్​ సభ్యుడు కూడా. ఐపీఎల్​ ఆడకపోయినా.. ఇతడు కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​లో రాణించాడు. విండీస్​ ఆటగాళ్లు ఎందరో ఐపీఎల్​లో రాణిస్తున్న నేపథ్యంలో రామ్​దిన్​ లాంటి ఆటగాడికి అసలు అవకాశం రాకపోవడం ఆశ్చర్యమే అని చెప్పొచ్చు.

దినేష్​ రామ్​దిన్​

3. స్టువర్ట్​ బ్రాడ్​

స్టువర్ట్​ బ్రాడ్​.. ఇంగ్లాండ్​ టాప్​ ఆటగాడు. వయసు మీద పడుతున్నా.. వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. 152 టెస్టులాడిన బ్రాడ్​.. 537 వికెట్లు తీశాడు. వన్డేల్లో 178, టీ20ల్లో 65 వికెట్లతో రాణించాడు. 2011, 2012 ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​ ఇతడిని తీసుకున్నప్పటికీ.. గాయం కారణంగా లీగ్​లో పాల్గొనలేకపోయాడు. ఆ తర్వాత అసలు అతడిపై ఏ ఫ్రాంఛైజీ దృష్టిసారించలేదు.

broad
బ్రాడ్​

4. వెర్నోన్​ ఫిలాండర్​

సౌతాఫ్రికా తరఫున కొద్దికాలమే ఆడినా.. ఈ బౌలర్​ అద్భుతంగా రాణించాడు. అనతికాలంలోనే నెం.1 టెస్టు బౌలర్​గా ఎదిగాడు. 64 టెస్టుల్లోనే 224 వికెట్లు తీశాడు. వన్డేలు, టీ-20ల్లోనూ వికెట్ల పండగ చేసుకున్నాడు. అయితే.. ఇతడికి ఐపీఎల్​లో ఆడే అవకాశం రాలేదు.

ఫిలాండర్​

భారత్​లో వర్దమాన క్రికెటర్లు.. జాతీయ జట్టులోకి రావాలంటే ఐపీఎల్ ఒక మంచి అవకాశంగా భావిస్తారు. హార్దిక్​ పాండ్య, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, బుమ్రా, వాషింగ్టన్​ సుందర్​, అక్షర్​ పటేల్​, రిషభ్​ పంత్​, పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్​, రుతురాజ్​ గైక్వాడ్​, వెంకటేశ్​ అయ్యర్​, దీపక్​ చాహర్​, శార్దుల్​ ఠాకుర్​, రాహుల్​ చాహర్​ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదే. వీరంతా ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియాలో చోటు సంపాదించారు. ​ప్రస్తుత ఐపీఎల్​లోనూ ఆయుష్​ బదోనీ, అభినవ్​ మనోహర్​, జితేశ్​ శర్మ, వైభవ్​ అరోరా వంటి కుర్రాళ్లు రాణిస్తున్నారు.

ఇవీ చూడండి: ఈ ఫైటర్​ పంచ్​లే కాదు.. పరువాలూ అదుర్స్​

'సచిన్​ను ఎవరు ఔట్​ చేయమన్నారు.. వాళ్లు నిన్ను చంపేస్తారు: గంగూలీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.