ETV Bharat / sports

'క్రికెట్​పైనా కరోనా ఎఫెక్ట్​- ఐపీఎల్​ నిదర్శనం' - టీ20 ప్రపంచకప్​పై ఇయాన్​ ఛాపెల్​ ఏమన్నాడంటే

కరోనా వైరస్​ కారణంగా క్రికెట్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపాడు ఆసీస్ మాజీ క్రికెటర్​ ఇయాన్ ఛాపెల్. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. ఈ దఫా.. భారత్​లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్​​ వాయిదా పడటం లేదా వేదిక మారే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.

Ian Chappell
ఇయాన్​ ఛాపెల్​
author img

By

Published : May 10, 2021, 9:24 AM IST

కొవిడ్ వల్ల క్రికెట్​లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయనడానికి.. ఐపీఎల్​ను నిలిపివేయడమే నిదర్శనమని ఆసీస్​ క్రికెట్​ దిగ్గజం ఇయాన్​ ఛాపెల్​ అన్నాడు. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది భారత్​లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్​ వాయిదా పడటమో, వేదిక మారడమో వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

గతంలోనూ వివిధ కారణాలతో క్రికెట్ మ్యాచ్​లు వాయిదాపడ్డాయని.. ఈ సందర్భంగా ఛాపెల్​ గుర్తు చేసుకున్నాడు. వాటిలో కొన్ని వింత కారణాలు ఉండేవని తెలిపాడు. 1970-71లో మెల్​బోర్న్ క్రికెట్​ గ్రౌండ్​లో ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య రద్దైన మ్యాచ్​ గురించి ఇయాన్ పేర్కొన్నాడు. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్​ ఒక్క బంతి పడకుండానే ఆగిపోయింది.

2006లో.. పాకిస్థాన్​-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు అకాలంగా ముగిసిందని ఇయాన్ ప్రస్తావించాడు. బాల్​ టాంపరింగ్​ కారణంగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇవ్వడానికి నిరాకరించింది పాక్​. మళ్లీ మైదానంలోకి దిగడానికి ఒప్పుకోలేదు. తొలుత ఈ మ్యాచ్​లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ.. 2008లో ఈ మ్యాచ్​ను​ డ్రాగా ప్రకటించింది ఐసీసీ.

ఇదీ చదవండి: మాడ్రిడ్‌ ఓపెన్‌ ఛాంప్‌ సబలెంక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.