ETV Bharat / sports

అఫ్గాన్​ జట్టుకు ఊరట - ఆ ముగ్గురిపై బ్యాన్​ ఎత్తివేత - ఫజల్‌హక్‌ ఫారూఖీ ఐపీఎల్

IPL Players Afghanistan Board : అఫ్గానిస్థాన్‌ ప్లేయర్లు నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీలపై విధించిన ఆంక్షలను ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో వారికి ఎన్ఓసీ(No Objection Certificate) ఇచ్చేందుకు అంగీక‌రించింది.

IPL Players Afghanistan
IPL Players Afghanistan
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 1:38 PM IST

IPL Players Afghanistan Board : అఫ్గానిస్థాన్‌ ప్లేయర్స్​ నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీలపై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఆ ముగ్గురు ప్లేయర్లు ఐపీఎల్​తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రధాన లీగ్‌లలో పాల్గొనవచ్చనంటూ తెలిపింది. సవరించిన పరిమితుల మేరకు ఈ ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్‌లను అంగీకరించడానికి, ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతినిచ్చినట్లు అందులో వెల్లడించాయి. అలా ఎన్ఓసీ(No Objection Certificate) ఇచ్చేందుకు అంగీక‌రించింది. అయితే దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని, అఫ్గ‌న్ క్రికెట్ అవ‌స‌రాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలని తేల్చి చెప్పింది.

అసలేం జరిగిందంటే ?
అఫ్గ‌నిస్థాన్ జ‌ట్టులో కీల‌క‌మైన‌ ముజీబ్, న‌వీన్, ఫారుఖీలు ఇటీవలే త‌మ‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ వ‌ద్ద‌ంటూ బోర్డుకు నివేదించారు. దీంతో, ఈ ముగ్గురికి దేశం కంటే వ్య‌క్తిగ‌త ప్ర‌యోజనాలే ముఖ్యమని భావించిన బోర్డు ఐపీఎల్‌తో పాటు ఇత‌ర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడకుండా ఉండేలా రెండేండ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు గ‌తంలో ఈ ముగ్గురికి ఇచ్చిన‌ ఎన్ఓసీని కూడా ఏసీబీకి చెందిన‌ ఓ ప్ర‌త్యేక క‌మిటీ ర‌ద్దు చేసింది. అయితే ఈ ఏడాది జరగనున్న టీ20 వ‌ర‌ల్డ్ కప్‌కు ఈ ముగ్గురు చాలా కీల‌కం. దీంతో వారి వివరణలను విన్న బోర్డు ఈ ముగ్గురిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది.

Afghanistan Players In IPL : ఇక వీరి ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే ముజీబ్​ ఉర్ రెహమాన్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఫజల్‌హాక్ ఫారూకీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇక న‌వీన్ ఉల్​ హక్​ ల‌ఖ్​నవూ సూప‌ర్​ జెయింట్స్‌లో కీలక ప్లేయర్​గా రాణిస్తున్నాడు. వీళ్ల‌తో పాటు అఫ్గ‌న్ టీ20 సార‌థి ర‌షీద్ ఖాన్‌, యువ క్రీడాకారుడు నూర్ అహ్మ‌ద్‌లు గుజ‌రాత్ టైటాన్స్‌ జట్టుకు ఆడుతున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో అమెరికా వేదికగా ఐపీఎల్ 17వ సీజ‌న్ ప్రారంభం కానుంది.

టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్​కు జట్టు ప్రకటన

భారత్​తో అఫ్గాన్​ తొలి ద్వైపాక్షిక సిరీస్​- టీమ్ఇండియా నెక్స్ట్​ టార్గెట్ అదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.