ETV Bharat / sports

IPL 2022 Mega Auction: గత సీజన్లో అధిక ధర.. ఈసారి ఎంత పలుకుతారో?

IPL 2022 Mega Auction: గతేడాది ఐపీఎల్​ సీజన్​లో పలువురు క్రికెటర్లను అత్యధిక ధరకు సొంతం చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. ఈసారి రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లనే అట్టిపెట్టుకోవాలి. దీంతో ఏఏ జట్లు ఎవరిని రిటైన్​ చేసుకుంటాయని క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గతేడాది అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలపై ఓ లుక్కేద్దాం..

chris morris, david warner, kl rahul
మోరిస్, వార్నర్, కేెఎల్ రాహుల్
author img

By

Published : Nov 29, 2021, 4:06 PM IST

IPL 2022 Mega Auction: ఇప్పుడు రాబోయేది అసలే ఐపీఎల్‌ మెగా వేలం. కొత్తగా రెండు జట్లు కూడా అదనంగా చేరుతున్నాయి. ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునే వెసులుబాటు. మిగతావారంతా మెగా వేలంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఏ జట్టు ఎవరిని తీసుకుంటుందో.. ఎంత మొత్తానికి దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఆలోపు గత సీజన్‌ వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకున్న ఆటగాళ్లలో ఆయా జట్లు ఎవరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.. మరి మిగతావారి పరిస్థితి ఏంటనేది ఓ సారి చూసేద్దాం..

క్రిస్‌ మోరిస్‌(Chris Morris IPL 2022): రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు. దాదాపు రూ. 16.25 కోట్లు సొంతం చేసుకున్న ఈ ఆల్‌రౌండర్‌ గత సీజన్‌లో పెద్దగా రాణించిందేమీ లేదు. తన విలువకు తగ్గ న్యాయం మాత్రం చేయలేకపోయాడు. రెండు విడతలవారీగా జరిగిన 14వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణం. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినా.. కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సారి క్రిస్‌ మోరిస్‌ను ఆర్‌ఆర్‌ రిటైన్​ చేసుకోవడం కష్టమే. అంతేకాకుండా వేలంలోనూ భారీ ధర దక్కకపోవచ్చు.

chris morris
క్రిస్ మోరిస్

ప్యాట్‌ కమిన్స్‌(Pat Cumminis Retention): ఆసీస్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కేకేఆర్‌ రూ. 15.5 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్‌లో జరిగిన తొలి దశలో మాత్రమే ప్యాట్‌ కమిన్స్‌ ఆడాడు. ఏడు మ్యాచుల్లో 93 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్‌ను ఈసారి కేకేఆర్‌ రిటెయిన్‌ అయితే చేసుకోవడం లేదు. వేలంలోనూ ఇంత భారీ ధర దక్కకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

మ్యాక్స్‌వెల్‌(Maxwell RCB Price): ఆల్‌రౌండర్‌ అయిన ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌2020లో రాణించని మ్యాక్సీ.. రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌ 2021లో మాత్రం బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 మ్యాచులు 14 ఇన్నింగ్స్‌ల్లో 513 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. హైయస్ట్‌ స్కోరు 76 పరుగులు. అయితే విరాట్ కోహ్లీతో సహా మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటెయిన్‌ చేసుకోనుంది.

సునిల్ నరైన్‌: కేకేఆర్‌ తరఫున ఆడే ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ను ఆ ఫ్రాంచైజీ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. విభిన్నమైన స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే నరైన్‌ను కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకుంటుందని సమాచారం. బ్యాటింగ్‌లోనూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. గత సీజన్‌లో కేకేఆర్‌ ఫైనల్‌కు రావడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో 62 పరుగులే చేసినా.. కీలక ఇన్నింగ్స్‌లను ఆడాడు.

డేవిడ్ వార్నర్‌ ( రూ. 12.55 కోట్లు)(Warner SRH) : క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకారో టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో నిరూపించాడు డేవిడ్‌ వార్నర్‌. ఆసీస్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర వార్నర్‌దే. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. అయితే గత సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచే తీసేసింది. తొలి దశలో అన్ని మ్యాచ్‌లను (7) ఆడిన వార్నర్‌.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడాడు. మిగతా మ్యాచుల్లో తుది జట్టులో స్థానం కూడా దక్కలేదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ను వార్నర్‌ వీడిపోతాడని అప్పుడే భావించారు. దానికి తగ్గట్టే డేవిడ్‌ కూడా వేలంలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ఈ సారి మెగా వేలంలో హాట్‌ టాపిక్‌గా డేవిడ్‌ వార్నర్‌ మారే అవకాశం ఉంది.

david warner
డేవిడ్ వార్నర్

కేఎల్‌ రాహుల్‌(KL Rahul IPL 2022): పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ను రూ. 11.95 కోట్లకు సొంతం చేసుకుంది. వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కేఎల్‌ రాహుల్‌ది (626) మూడో స్థానం. అయితే జట్టును నడిపించడంలో విఫలమయ్యాడనే విమర్శలు వస్తుండటం, పంజాబ్ కింగ్స్‌ రిటెయిన్‌ చేసుకోదనే వార్తల నేపథ్యంలో మెగా వేలంలోకి వెళ్లేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నాడు. అంతేకాకుండా కొత్త ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

kl rahul
కేెఎల్ రాహుల్

రషీద్‌ ఖాన్‌(Rashid Khan Retention): ఎస్‌ఆర్‌హెచ్‌ తురుపుముక్క ఆటగాళ్లలో రషీద్‌ ఖాన్‌ ఒకడు. అతడిని ఫ్రాంచైజీ రూ. 8.90 కోట్లకు కొనుగోలు చేసింది. 14 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన రషీద్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 3/36. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ అప్పుడప్పుడూ మెరుస్తుంటాడు. పది ఇన్నింగ్స్‌ల్లో 83 పరుగులు చేశాడు. కీలక ఆటగాడైన రషీద్‌ ఖాన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పుడైతే వదులుకోదు. కెప్టెన్‌ విలియమ్సన్‌తోపాటు రషీద్‌ను రిటెయిన్‌ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

హార్దిక్‌ పాండ్య(MI Hardik Pandya): ముంబయి ఇండియన్స్ జట్టులో హార్దిక్‌ పాండ్య కీలక ఆటగాడు. ఆ జట్టు విజయాల్లో ఎన్నోసార్లు తనవంతు పాత్ర పోషించాడు. దీంతో గతేడాది ముంబయి యాజమాన్యం అతడిని రూ.11 కోట్లతో అట్టిపెట్టుకుంది. అయితే, కొంతకాలం కిందట వెన్నెముక శస్త్ర చికిత్స చేసుకున్న పాండ్య తర్వాత బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడి బ్యాటింగ్‌లో 14.11 సగటుతో కేవలం 127 పరుగులే చేశాడు. మరోవైపు బౌలింగ్‌లో అసలు బంతే అందుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే మెగా వేలంలో ముంబయి హార్దిక్‌ను వదులుకునే వీలుంది.

hardik pandya
హార్దిక్ పాండ్య
  • గత సీజన్‌ వరకు ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ కోహ్లీ (రూ. 17 కోట్లు) అత్యధిక విలువైన ఆటగాడు. ఈ సారి కూడా ఆర్‌సీబీ కోహ్లీని రిటెయిన్‌ చేసుకుంటుందని సమాచారం. అయితే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా సారథులలో ఎంఎస్ ధోనీ - రూ. 15 కోట్లు (సీఎస్‌కే), రోహిత్ శర్మ - రూ. 15 కోట్లు (ముంబయి ఇండియన్స్), రిషభ్‌ పంత్‌ - రూ. 15 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్) ముందు వరుసలో ఉన్నారు. వీరిందరినీ ఆయా జట్లు అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

IPL Auction 2022: అందరి చూపు శ్రేయస్ వైపే.. ఎవరికి దక్కేనో!

PBKS IPL 2022: రాహుల్ ఎఫెక్ట్.. ఒక్కరూ వద్దంటున్న పంజాబ్!

CSK next captain: 'ధోనీ వారుసుడిగా అతనే సరైనోడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.