ETV Bharat / sports

'వేలంలో సీఎస్కే తీసుకోబోయే మొదటి ప్లేయర్ అతడే'

Suresh Raina IPL Mega Auction: ఐపీఎల్-2022లో భాగంగా జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్​లో సురేశ్ రైనాకు మొండిచేయి చూపించింది చెన్నై సూపర్ కింగ్స్. దీనిపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. మెగావేలంలో ఫ్రాంచైజీ అతడిని తీసుకునే వీలుందని తెలిపాడు.

Suresh Raina latest news, Suresh Raina robin uthappa, రైనా లేటెస్ట్ న్యూస్, రైనా ఉతప్ప
Suresh Raina
author img

By

Published : Dec 1, 2021, 9:32 PM IST

Suresh Raina IPL Mega Auction: ఐపీఎల్-2022 సీజన్​కు ముందు జరిగిన ప్లేయర్స్ రిటెన్షన్​లో సురేశ్ రైనాను వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్. జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్​లను అట్టిపెట్టుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన రైనాను.. ఈసారి జట్టులో చూడబోమా? అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ఇదే విషయమై మాట్లాడిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. రైనాను చెన్నై వేలంలో తీసుకునే వీలుందని తెలిపాడు.

"సీఎస్కే జట్టులో రైనా స్టార్ ఆటగాడు. 10-12 ఏళ్ల నుంచి చెన్నై నాకౌట్ స్టేజ్​కు చేరడంలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈసారి మెగావేలంలో చెన్నై తీసుకోబోయే మొదటి ఆటగాడు రైనానే అనుకుంటున్నా. డుప్లెసిస్​ను వదులుకోవడం కూడా కష్టమే. కానీ మొయిన్ అలీ వైపు మొగ్గు చూపింది యాజమాన్యం. ఎందుకంటే అతడో ఆల్​రౌండర్."

-ఉతప్ప, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

chennai super kings retained players 2022: ఈసారి ఆటగాళ్ల రిటెన్షన్​లో జడేజాను 16 కోట్లు పెట్టి మొదటి ప్రాధాన్య ఆటగాడిగా తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. రూ.12 కోట్లతో ధోనీని రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఎంపిక చేసింది. తర్వాత మొయిన్ అలీ, రుతురాజ్​పై నమ్మకముంచింది.

ఇవీ చూడండి: 'వేలానికి వెళ్తానని రాహుల్ చెప్పాడు.. అందుకే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.