IPL Mega Auction 2022: రెండో రోజు ఐపీఎల్ వేలంలోనూ.. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కురిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ. 11.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఇతడి కోసం చెన్నై, కోల్‌కతా, గుజరాత్, సన్‌రైజర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు పంజాబే అతడిని దక్కించుకుంది. ఇతడికి గతేడాది రాయల్స్.. రూ. 75 లక్షలే చెల్లించడం గమనార్హం.
ఒడియన్ స్మిత్..
విండీస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌పై దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు దృష్టిసారించాయి. తొలుత పంజాబ్, లఖ్‌నవూ పోటీపడగా.. అనంతరం.. సన్‌రైజర్స్, రాజస్థాన్ పోటీలోకి వచ్చాయి. ఆఖరికి పంజాబే రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది.
జాన్సెన్ కోసం పోటాపోటీ..
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్, ముంబయి మాజీ ప్లేయర్ మార్కో జాన్సెన్ను రూ. 4.20 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. ముంబయి పోటీపడినా.. చివర్లో వద్దనుకుంది.
గత సీజన్లో ముంబయికి ఇతడు రూ. 20 లక్షలకే ఆడాడు.
ఆల్రౌండర్లకు భలే గిరాకీ..
ఆల్‌రౌండర్లు లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్ మాదిరిగానే.. ఇతర ఆల్రౌండర్లపై ఫ్రాంఛైజీలు బాగానే ఖర్చుచేశాయి.
- గుజరాత్ టైటాన్స్.. విజయ్ శంకర్(రూ. 1.40 కోట్లు), జయంత్ యాదవ్(రూ.1.70 కోట్లు), డోమినిక్ డ్రేక్స్(రూ. 1.10 కోట్లు) ఖర్చు పెట్టి దక్కించుకుంది.
- శివం దూబేను రూ. 4 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది.
- కృష్ణప్ప గౌతమ్ రూ. 90 లక్షలకు లఖ్‌నవూ సొంతమయ్యాడు.
రహానెకు నిరాశ..
సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ను రూ. 2.60 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం చేసుకోగా.. మన్దీప్ సింగ్‌ను రూ.1.10 కోట్లకు దిల్లీ దక్కించుకుంది.
గతేడాది రూ. 4 కోట్లు పలికిన టీమ్ఇండియా బ్యాటర్ అజింక్య రహానెకు ఈసారి నిరాశే ఎదురైంది. అతడిని రూ. కోటి కనీస ధరకే కేకేఆర్ దక్కించుకుంది.
మోర్గాన్, మలన్ అన్‌సోల్డ్..
కోల్‌కతా మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(ఇంగ్లాండ్), పంజాబ్‌కు ఆడిన డేవిడ్ మలన్(ఇంగ్లాండ్), క్రిస్ జోర్డాన్(ఇంగ్లాండ్), జేమ్స్ నీషమ్(న్యూజిలాండ్), ఆసీస్ ప్లేయర్లు ఆరోన్ ఫించ్, మార్నస్ లబుషేన్‌లపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.
టీమ్ఇండియా ఆటగాళ్లు ఛెతేశ్వర్ పుజారా, సౌరభ్ తివారీలు అన్‌సోల్డ్‌గా మిగిలారు.
ఇవీ చూడండి: IPL 2022: యువ క్రికెటర్లపై కాసుల వర్షం.. టాప్‌లో ఇషాన్, దీపక్
Ashwin Buttler: అశ్విన్‌కు బట్లర్ స్వాగతం.. క్రీజు లోపలే ఉన్నానంటూ..