ETV Bharat / sports

ఐపీఎల్​లో ధారాళంగా పరుగులు ఇచ్చిన మేటి బౌలర్లు! - ishant sharma

IPL 2022: ఐపీఎల్​లో బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేసినా ఒక్కోసారి భారీగా పరుగులు సమర్పించుకోక తప్పదు. తమది కాని రోజున గొప్ప వైవిధ్యంతో బంతులేసినా బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో విఫలమవుతుంటారు. అలా అని ఒక్క మ్యాచులో భారీగా పరుగులు ఇచ్చినంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయలేం. లీగ్​ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల గురించి తెలుసుకుందాం.

most-runs-conceded-by-bowlers-in-ipl
most-runs-conceded-by-bowlers-in-ipl
author img

By

Published : Mar 25, 2022, 5:05 PM IST

IPL 2022: మైదానంలో ఆటగాళ్లు చేసే చిన్న చిన్న తప్పిదాలే ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. బౌలర్‌ వేసే ప్రతి బంతి.. బ్యాటర్‌ చేసే ప్రతి పరుగూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటిది బౌలర్లు ధారాళంగా పరుగులిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్ప బౌలరైనా తమది కాని రోజున బ్యాటర్లకు బలి కావాల్సిందే. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు ఇచ్చిన టాప్-10 బౌలర్లు ఎవరో ఓ సారి చూద్దాం.!

బాసిల్ తంపి.. 70 పరుగులు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుకు తక్కువ లక్ష్యాలను కూడా కాపాడుకోగలదనే పేరుంది. ఎందుకంటే, ఆ జట్టు బౌలింగ్ విభాగం అంత బలంగా ఉంటుంది మరి. అయితే, 2018 సీజన్‌లో సన్‌ రైజర్స్‌ బౌలర్ బాసిల్‌ తంపి తేలిపోయాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచులో తంపి తన కోటా నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు ఇచ్చాడు. గతేడాది వరకు హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడిన తంపిని.. గత నెలలో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ జట్టు రూ.30 లక్షలకు దక్కించుకుంది.

most-runs-conceded-by-bowlers-in-ipl
బాసిల్ తంపి

ఇషాంత్ శర్మ కూడా భారీ గానే.. 2013 సీజన్‌లో హైదాబాద్‌ జట్టు తరఫున ఆడిన సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కూడా భారీగానే పరుగులు ఇచ్చాడు. ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో జరిగిన ఓ మ్యాచులో ఇషాంత్‌.. 4 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. 2019లో సన్‌ రైజర్స్ హైదారాబాద్‌ జట్టుతో జరిగిన మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ ముజీబ్-ఉర్‌-రహ్మాన్‌ కూడా ఇన్నే పరుగులు ఇచ్చాడు. తాజా వేలంలో వీళ్లిద్దరినీ ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

most-runs-conceded-by-bowlers-in-ipl
ఇషాంత్​ శర్మ

ఉమేశ్ యాదవ్‌ తేలిపోయాడు.. అనుభవమున్న పేసర్‌గా కట్టుదిట్టంగా బంతులేసే ఉమేశ్ యాదవ్‌ కూడా ఓ మ్యాచులో భారీగా పరుగులు ఇచ్చాడు. 2013లో దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో.. అప్పటి దిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఉమేశ్ తేలిపోయాడు. 4 ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. 2014లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఓ మ్యాచులో అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బౌలర్‌ సందీప్‌ శర్మ.. హైదారాబాద్ బ్యాటర్ల ధాటికి 65 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇటీవలి వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టు ఉమేశ్ యాదవ్‌ని రూ.2 కోట్లకు దక్కించుకోగా.. సందీప్‌ శర్మను రూ. 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

most-runs-conceded-by-bowlers-in-ipl
ఉమేశ్ యాదవ్‌

వీరితో పాటు హైదరాబాద్ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్.. 2020 సీజన్‌లో దుబాయి వేదికగా ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో రెండు వికెట్లు పడగొట్టి 64 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌ వేలంలో అతడిని రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. 2013లో పుణె వారియర్స్‌ జట్టు తరఫున ఆడిన మాజీ బౌలర్ అశోక్‌ దిండా.. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌ జట్టుతో జరిగిన మ్యాచులో 63 పరుగులు ఇచ్చాడు. 2012 సీజన్‌లో దిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు వరుణ్‌ ఆరోన్‌ కూడా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచులో ఇన్నే పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడిని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.

సిద్ధార్థ్‌ కౌల్
సిద్ధార్థ్‌ కౌల్
most-runs-conceded-by-bowlers-in-ipl
లుంగి ఎంగిడి

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) బౌలర్‌ లుంగి ఎంగిడి.. 2021లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో 62 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం అతడిని దిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది. ఒకప్పటి కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు మైఖేల్ నేసర్‌.. 2013 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచులో 62 పరుగులు ఇచ్చాడు. గతంలో విఫలమైన ఈ బౌలర్లు అతి త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లో మెరుగ్గా రాణిస్తారేమో చూడాలి.!

ఇదీ చదవండి: IPL 2022: అత్యధిక శతకాల వీరులు వీరే.. జాబితాలో కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.