ETV Bharat / sports

ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే! - ఐపీఎల్​ 2024 మినీ వేలం వేదిక

IPL 2024 Indian Uncapped Players : 2024 ఐపీఎల్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. దేశ, విదేశీ క్రికెటర్లు ఈసారి వేలానికి సిద్ధం కాగా ఇందులో కొంతమంది ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి(SMAT)లో అదరగొట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే?

IPL 2024 Indian Uncapped Players
IPL 2024 Indian Uncapped Players
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 12:38 PM IST

IPL 2024 Indian Uncapped Players : ఐపీఎల్ 2024 సీజన్​కు సమయం ఆసన్నమైంది. అమెరికా వేదికగా జరగనున్న 2024 ఐపీఎల్​ సీజన్​ కోసం ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు కూడా ప్లేయర్లను ఎంచుకునేందుకు మిని వేలం కోసం ఎదురుచూస్తున్నాయి. దుబాయ్​ వేదికగా డిసెంబర్ 19న జరిగే ఈ వేలంలో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లతో దరఖాస్తు చేసుకున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి ఐపీఎల్​లో తమ ట్యాలెంట్​ చూపించేందుకు ఎంతో మంది ఇండియన్ క్రికెటర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్న ఈ క్రికెటర్లు ఎవరో ఓ సారి చూద్దాం.

హర్విక్ దేశాయ్ (సౌరాష్ట్ర):
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిీలో సౌరాష్ట్ర తరఫున ఆడిన ఈ యంగ్​ ప్లేయర్​ 67 నెట్ రన్ రేట్‎తో 175 స్ట్రైక్ రేట్‎తో 336 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇతడికి వికెట్ కీపర్​గా, ఓపెనర్​గా మంచి ట్రాక్​ రికార్డు ఉంది.

రవితేజ (హైదరాబాద్):హైదరాబాద్​కు చెందిన 29 ఏళ్ల యంగ్​ బౌలర్ రవితేజ తన ఆటతీరుతో అందరిని అబ్బురపరుస్తున్నాడు. లైన్, లెన్త్, కంట్రోల్ ప్రధానమైన 'ముఖేష్ కుమార్ మోల్డ్'తో ఈసారి ఐపీఎల్ బరిలో ఈ యంగ్ బౌలర్​ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అభిమన్యు సింగ్ రాజ్​పుత్ (బరోడా):సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలోకి బరోడా జట్టు తరఫున బరిలోకి దిగాడు అభిమన్యు సింగ్. వివిధ దశల్లో బౌలింగ్ చేయగల సామర్థ్యం కలిగిన ఈ యంగ్ క్రికెటర్ బౌలింగ్​తోనే కాకుండా తన బ్యాటింగ్​తోనూ అదరగొట్టాడు. క్వార్టర్ ఫైనల్లో ముంబయి మీద 21 బంతుల్లో 27 పరుగులు, పంజాతో జరిగిన ఫైనల్లో 42 బంతుల్లో 61 పరుగులు చేశాడు.సౌరవ్ చౌహాన్ (గుజరాత్):సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం గుజరాత్ తరఫున ఆడిన సౌరవ్ చౌహాన్ తన ఆట తీరుతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్​లో 36 యావరేజ్‎తో రెండు హాఫ్ సెంచరీలు బాది మొత్తం 251 పరుగులు చేశాడు. దీంతో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మెన్ల జాబితాలో మూడవ అత్యధిక స్కోరుతో నిలిచాడు. ప్రతి 8.5 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టగల సామర్థ్యం ఉన్న ఈ యంగ్​ క్రికెటర్​ 21 బౌండరీలు, 16 హిట్​లతో టోర్నమెంట్‎లో తన బెస్ట్ ఇచ్చాడు.
దర్శన్ మిసాల్ (గోవా):గోవా జట్టు సారథిగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్​గా దర్శన్ మిసాల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన మార్క్ ఆట తీరును ప్రదర్శించాడు. ఈ టోర్నీలో అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరు మ్యాచుల్లో 16.62 యావరేజ్, 6.65 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. అతిత్ సేథ్ (బరోడా):బరోడా టీంలోని మరో మెరిక అతిత్ సేథ్. 27ఏళ్ల అతిత్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి(SMAT)లో 18 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను 14.3 యావరేజ్, 7.6 ఎకానమీ రేటుతో అదరగొట్టేశాడు. ఇతను లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కూడా కావడంతో ఐపీఎల్ వేలంలో మంచి డిమాండ్ ఉండే పరిస్థితి ఉంది.అశుతోష్ శర్మ (రైల్వేస్):రైల్వేస్​కు చెందిన ఈ 25 ఏళ్ల బ్యాట్స్​మెన్ కేవలం 6 ఇన్నింగ్స్​లో 277.27 స్ట్రైక్ రేట్​తో 183 పరుగులు చేశాడు. ఆంధ్రాతో జరిగిన మ్యాచ్​లో 12 బంతుల్లో 53 పరుగులు చేసి తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. టీ20 ఫార్మాట్లో హార్డ్ హిట్టింగ్ సామర్థ్యంతో గేమ్ ఛేంజర్​గా బరిలోకి దిగే అవకాశం ఈ స్టార్ క్రికెటర్​కు ఉంది.రుద్ర ఎం పటేల్ (గుజరాత్):వివిధ ట్రోఫీల్లో తన సత్తాచాటిన రుద్ర ఎం పటేల్ కూడా ఐపీఎల్​లో హాట్ ఫేవరెట్​గా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినూ మన్కడ్ ట్రోఫీలో రుద్ర ఇప్పటి వరకు 5 మ్యాచ్​లు ఆడగా అందులో 513 పరుగులు సాధించాడు. ఇక ఛాలెంజర్ ట్రోఫీలో 4 మ్యాచులు ఆడి 263 పరుగులు చేశాడు. అటు అండర్-19 క్వాడ్రాంగులర్ సిరీస్​లో 568 పరుగులు చేసి సత్తా చాటాడు.

Syed Mushtaq Ali T20: ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక.. హైదరాబాద్​కు నిరాశ

'పంజాబ్​'దే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ - తొలిసారి టైటిల్ కైవసం, ఫైనల్​లో బరోడా డీలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.