IPL 2024 Auction Date Venue : క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు వన్డే ప్రపంచకప్ మూడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 సీజన్ మెగా వేలం జరిగే అవకాశం ఉందని తెలిసింది. అదేవిధంగా వచ్చే ఎడిషన్ కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము కూడా మరికొంత పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
"పది జట్లు పాల్గొనే ఐపీఎల్ వేలానికి సంబంధించిన ప్రక్రియ నిర్వహణ క్లిష్టంగా ఉంటుంది. ఒకే చోట వందల సంఖ్యలో హోటల్ గదులు, సదుపాయాలు కల్పించడం కష్టంతో కూడుకున్న పని. బీసీసీఐ అధికారులు, ఫ్రాంచైజీలకు సంబంధించిన ప్రతినిధులు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది... ఇలా చాలామంది ఉంటారు. అందుకే దుబాయ్‌ను వేదికగా ఈ ప్రక్రియ జరుగుతుంది. 2023లో ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి ఫ్రాంచైజీకి 95 కోట్ల రూపాయల వరకు ఉండేవి. ఇప్పుడు ఆ సొమ్మును మరో 5కోట్ల రూపాయలు పెంచేందుకూ ఆలోచన చేస్తున్నాం. అంటే 2024 సీజన్ కోసం నిర్వహించే వేలంలో రూ. 100 కోట్ల వరకు తమ సొమ్మును వెచ్చించేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం దక్కనుంది’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
మహిళా లీగ్ కోసం వేలం..
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 కోసం కూడా వేలం నిర్వహించేందుకూ సన్నాహలు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 9న మహిళా క్రికెటర్ల కోసం వేలం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఐపీఎల్ లేదా బీసీసీఐ దీనిపై అధికారికంగా స్పందించలేదు.
క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్-2024 మినీ వేలం అప్పుడే!
IPL 2024 Mini Auction : భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్లా ప్రపంచంలో మరే లీగ్ ఫేమస్ కాలేదు. విదేశీ, స్వదేశీ ప్లేయర్లతో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు మంచి కిక్కిస్తుంది. ఈ లీగ్ జరుగుతున్నంత కాలం క్రికెట్ ప్రియులు టీవీలను వదలరు. కొందరూ టికెట్లు బుక్ చేసుకుని నేరుగా స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తారు. తమ అభిమాన జట్టు కప్ గెలవాలని కోరుకుంటారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్ మినీ వేలం-2024, వేదికలు ఇలా కొన్ని విషయాల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ODI World Cup 2023 Rohith Sharma : కెప్టెన్‌గా 100వ మ్యాచ్.. అరుదైన రికార్డ్‌పై హిట్ మ్యాన్ గురి