ETV Bharat / sports

'అవును.. ఒకసారి అలా జరిగింది.. ఈ విషయం అర్జున్‌కు గుర్తుచేయకండి' - అర్జున్‌ తెందుల్కర్​ బౌలింగ్​

'అవును.. ఒక్కసారి అలా జరిగింది.. ఈ విషయం అర్జున్‌కు గుర్తుచేయకండి' అని క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​.. నెటిజన్లుకు కోరాడు! ఆ సంగతేంటి?

sachin
sachin
author img

By

Published : Apr 22, 2023, 2:10 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు.. 34,357 పరుగులు.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు.. క్రికెట్‌ దేవుడంటూ నీరాజనాలు.. టీమ్​ఇండియా దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నెన్నో చిరస్మరణీయ విజయాలు.. అనేకానేక రికార్డులు.. గొప్ప ఆటగాడిగా పేరొందిన సచిన్‌ 2013లో రిటైర్‌ అయినా.. అభిమానులు మాత్రం ఏదో ఒక సందర్భంలో అతడి ఘనతలు గుర్తుచేసుకుంటూ నేటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్​ వంతు వచ్చింది.

దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఈ బౌలర్​.. ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2023 సీజన్‌తో ముంబయి ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తన రెండో మ్యాచ్‌లో తొలిసారి వికెట్‌ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో సచిన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తానెంత ఎత్తుకు ఎదిగినా పిల్లల చిన్న చిన్న ఘనతలే తనకు ఎంతో గొప్ప అని భావించే సగటు తండ్రి మనసును చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్​లో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌కు ఓ ఫాలోవర్‌ అర్జున్ గురించి ఓ ప్రశ్న అడిగాడు.

సచిన్‌ తొలిసారిగా ట్విట్టర్​ శుక్రవారం నిర్వహించిన #AskSachin సెషన్‌లో.. "మిమ్మల్ని అర్జున్‌ ఎప్పుడైనా అవుట్‌ చేశాడా?" అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. "అవును.. ఒకే ఒక్కసారి.. అది కూడా లార్డ్స్‌లో.. కానీ ఈ విషయం అర్జున్‌కు అస్సలు గుర్తుచేయకండి" అని సరదాగా బదులిచ్చాడు.

కాగా, సచిన్‌ తెందుల్కర్​ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ (2008-13)కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్‌ అరంగేట్రం నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడిన.. అది కూడా ఒకే జట్టుకు ఆడిన తండ్రీకొడుకులుగా వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాగా సచిన్‌ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌ ఐకాన్‌గా ఉన్నాడు.

ఇకపోతే.. అర్జున్‌ తన రెండో ఐపీఎల్​ మ్యాచ్​లో తొలి వికెట్​ తీసినప్పుడు సచిన్​.. డ్రెస్సింగ్​ రూమ్​లో సంబరాలు చేసుకున్నాడు. అలాగే వీరిద్దరిని పోలిస్తే.. అర్జున్​ వికెట్​ ఎంత గొప్పదో కూడా తెలుస్తుంది. ఎందుకంటే సచిన్‌ తన ఐపీఎల్‌ కెరీర్​లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు. 2009లో సచిన్‌ ఆరు ఓవర్లు వేసినా.. ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. ఇప్పుడీ విషయంలో సచిన్‌ను అర్జున్​ అధిగమించాడు. అలానే ఈ తండ్రీకుమారుల మధ్య మరో పోలిక కూడా ఉంది. 2009 సీజన్​లో కోల్‌కతా నైట్​ రైడర్స్​పై ముంబయి ఇండియన్స్​ తరఫున తొలిసారిగా బౌలింగ్‌ చేసిన సచిన్‌ తెందుల్కర్​.. మొదటి ఓవర్‌లో 5 పరుగులే సమర్పించుకున్నాడు. ఇటీవల అదే కోల్‌కతా నైట్​ రైడర్స్​పై జరిగిన మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ కూడా తన తొలి ఓవర్‌లో ఐదు పరుగులే ఇవ్వడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.