ETV Bharat / sports

IPL 2023: చెన్నైకు బిగ్​ షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఔట్

ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

ipl 2023 csk
ipl 2023 csk
author img

By

Published : Mar 20, 2023, 12:16 PM IST

ఐపీఎల్ ఆరంభానికి ముందే ఫారిన్ ప్లేయ‌ర్స్ ఒక్కొక్కొరుగా జ‌ట్ల‌కు దూర‌మ‌వుతూ ఫ్రాంఛైజీలకు షాక్ ఇస్తున్నారు. తాజాగా గాయంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ కైల్ జేమీస‌న్ ఐపీఎల్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. జేమీస‌న్ స్థానంలో సౌతాఫ్రికా పేస‌ర్ సిసాండ మ‌గ‌ళ‌ను జ‌ట్టులోకి తీసుకుంటున్న‌ట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ప్ర‌క‌టించింది.

న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌రౌండ‌ర్ జేమీస‌న్ ఐపీఎల్‌లో 2021 సీజ‌న్‌ మాత్ర‌మే ఆడాడు. ఆ సీజ‌న్ వేలంలో అత‌డిని రూ.15 కోట్ల‌కు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కొనుగులు చేసింది. ఆ ఏడాది అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఫారిన్ ప్లేయ‌ర్‌గా జేమీస‌న్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ త‌న‌పై బెంగ‌ళూరు పెట్టుకున్న అంచ‌నాల్ని పూర్తిగా వ‌మ్ముచేశాడు జేమీస‌న్. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. తొమ్మిది మ్యాచుల్లో తొమ్మిది వికెట్లు మాత్ర‌మే తీశాడు. బ్యాటింగ్‌లోనూ 65 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌డంతో అత‌డిని బెంగ‌ళూరు వ‌దులుకుంది.

ఐపీఎల్ 2023 వేలంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జేమీస‌న్‌ను కోటి రూపాయ‌ల క‌నీస ధ‌ర‌కు కొనుగోలు చేసింది. కానీ గాయంతో ఈ సీజ‌న్ మొత్తానికి జేమీస‌న్ దూర‌మ‌య్యాడు. వెన్నుగాయంతో అత‌డు బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం స‌ర్జ‌రీ చేసుకోనున్న‌ట్లు తెలిసింది. స‌ర్జ‌రీ కార‌ణంగా నాలుగు నెల‌ల పాటు జేమీస‌న్ క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉండ‌నున్న‌ట్లు సమాచారం. అందుకోస‌మే ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో అత‌డు ఆడ‌టం లేద‌ట.

మరోవైపు, మగళను రూ.50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే సొంతం చేసుకుంది. మగళకు దేశవాళీ టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు 127 టీ20లు ఆడిన మగళ.. 136 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తొలి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున ఆడిన మగళ.. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు సాధించాడు. అతడు దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్‌ 16వ సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి.

అయితే అన్ని జట్లకు లీగ్​ ప్రారంభానికి ముందే షాక్​లు తగులుతున్నాయి. గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు లీగ్​కు దూరమవుతున్నారు. సీజన్​ మొదలయ్యేందుకు టైమ్​ దగ్గరపడేకొద్దీ గాయపడిన ప్లేయర్ల జాబితా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సీజన్​కు దూరమవ్వనున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు మొత్తం సొమ్మును చెల్లిస్తాయా? లేక సగమే ఇస్తాయా? సీజన్​కు ముందు ఆయా ఫ్రాంచైజీలు ఎంత మేరకు నష్టపోనున్నాయి?.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.