టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92; 50 బంతుల్లో 4x4, 9x6) కాస్తలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. మొయిన్ అలీ (23; 17 బంతుల్లో 4x4, 1x6), శివమ్ దూబె (19), ధోనీ (14), అంబటి రాయుడు (12), బెన్ స్టోక్స్ (7) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమి తలో రెండు వికెట్లు తీయగా.. లిటిల్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
చెన్నై బ్యాటింగ్‌లో.. 14 పరుగుల వద్ద డెవోన్ కాన్వే(1) మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. దీంతో కాన్వే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీకి ఇది 100వ ఐపీఎల్ వికెట్ కావడం విశే షం. కానీ మరో ఓపెనర్ గైక్వాడ్ మాత్రం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బ్యాట్‌తో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందించాడు. ఈ సీజన్లో తొలి సిక్సర్, తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గానూ నిలిచాడు. అతడి దూకుడు చూసిన అభిమానులు.. స్కోరు 200 దాటుతుందని ఆశించారు. కానీ అది జరగలేదు. అతడు తప్ప మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. మొత్తంగా గైక్వాడ్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన సెంచరీకి చేరువలో.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే చివర్లో వచ్చిన ధోనీ(14) ఒక సిక్స్, ఒక ఫోర్‌తో ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చాడు. దీంతో సీఎస్కే 170 ప్లస్ స్కోర్ చేసింది.
షమీ ఘనత.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో 100 వికెట్ల సాధించిన బౌలర్ల ఎలైట్ జాబితాలో నిలిచాడు. డెవాన్ కాన్వేను ఔట్ చేసిన అతడు.. ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. మొత్తంగా ఈ మార్క్ సాధించిన ప్లేయర్స్ జాబితాలో 19వ స్ధానంలో నిలిచాడు. అలానే ఈ రికార్డు అందుకున్న 14వ భారత బౌలర్‌గాను ఘనత సాధించాడు. 94 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా, 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన షమి.. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరపున కూడా ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చూడండి: IPL 2023: బాలయ్య నయా అవతార్ సూపర్.. తెలుగు సాంగ్స్‌తో అదరగొట్టిన తమన్నా, రష్మిక