ETV Bharat / sports

ఐపీఎల్​లో మోస్ట్​ సక్సెస్​ఫుల్​ కెప్టెన్స్​ వీళ్లే! - IPL 2022

IPL 2022 Successful Captains: టీ20 ఫార్మాట్​లో కెప్టెన్సీ అనేది కత్తిమీద సాములాంటిది. క్షణాల్లో ఫలితం మారిపోయే ఈ ఫార్మాట్లో తీసుకునే నిర్ణయాల్లో తడబాటు అనేది ఉండకూడదు. ఎవరైతే ప్రశాంతంగా ఉండి, సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న వారే ఐపీఎల్​లో తమ జట్లకు విజయాల్ని అందించగలరు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ 15వ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్​ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ల గురించి తెలుసుకుందాం.

ipl 2022
successful captains in ipl
author img

By

Published : Mar 14, 2022, 10:27 AM IST

IPL 2022 Successful Captains In History : ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్‌ లీగ్‌. మరి అటువంటి లీగ్​లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం, టీమ్​ను విజయపథంలో ముందుకు తీసుకెళ్లడం అంత ఆషామాషీ కాదు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. సారథిగా వ్యవహరించిన ప్రతిఒక్కరూ విజయవంతమైన కెప్టెన్​ కాలేరు. అయితే కొంతమంది మాత్రం తమ నిలకడైన ఆటతో ఈ లీగ్‌ను ఎంజాయ్‌ చేస్తూనే కెప్టెన్లుగానూ సక్సెస్​ను అందుకున్నారు. జట్టును విజయపథంలో ముందుకు తీసుకెళ్లారు. కాగా,ఈ నెల 26నుంచి ఐపీఎల్‌-15 సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌ చరిత్రలో విజయవంతమైన టాప్‌-5 కెప్టెన్లు ఎవరు? వారి విజయ శాతం ఎంత ఉంది? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..

రోహిత్ శర్మ

Successful Captain Rohith Sharma: ముంబయి ఇండియన్స్​ జట్టుకు 8 ఏళ్లుగా కెప్టెన్​గా ఉన్న రోహిత్​ శర్మ.. టీమ్​కు ఐదు సార్లు విజయాలను అందించాడు. ఐపీఎల్​ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 116 ఐపీఎల్​ మ్యాచులకు సారథ్యం వహించిన అతడు​.. అందులో 70 సార్లు విజయాన్ని అందుకున్నాడు. రోహిత్​ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో కప్​ను సొంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్​. ఇతడి విజయ శాతం 60.34గా ఉంది.

IPL 2022
రోహిత్​ శర్మ

స్టీవ్​ స్మిత్​

Steve Smith: టీ20 లీగ్​లతో పాటు అంతర్జాతీయ క్రికెట్​లోనూ కెప్టెన్​గా ఆస్ట్రేలియన్​ క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ తన సత్తాను నిరూపించుకున్నాడు. 2017లో పుణె వారియర్స్​ కెప్టెన్​గా​ బాధ్యతలు అందుకున్న స్టీవ్​ స్మిత్​.. జట్టును అద్భుతంగా ముందుకు సాగించాడు. అలాగే రాజస్థాన్​ రాయల్స్​కు కూడా కొన్ని సీజన్లకు సారథిగా వ్యవహరించాడు. మొత్తం 42 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన స్మిత్​ 25 విజయాల్ని అందించాడు. ఇతడి విజయ శాతం 59.52గా ఉంది.

IPL 2022
స్టీవ్​ స్మిత్​

సచిన్​ తెందూల్కర్​

Sachin Tendulkar: భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​గా పెద్దగా రాణించని సచిన్​ తెందూల్కర్​ ఐపీఎల్​లో మాత్రం తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇతడి సారథ్యంలో ముంబయి జట్టు 2010 సీజన్​ ఫైనల్​ చేరుకుంది. కానీ, తుదిపోరులో చెన్నై చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఐపీఎల్​లో 51 మ్యాచ్​లకు సారథ్యం వహించిన సచిన్.. 30 మ్యాచ్​ల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.82గా ఉంది.

IPL 2022
సచిన్​ తెందూల్కర్​

ఎంఎస్​ ధోనీ

CSK Dhoni: ఐపీఎల్​ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుకు కెప్టెన్​గా కొనసాగుతుంది ధోనీ ఒక్కడే. చెన్నై సూపర్​ కింగ్స్​కు సారథ్యం వహిస్తున్న ఇతడు ఇప్పటివరకు మూడు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. మొత్తంగా 188 మ్యాచులకు సారథ్యం వహించిన ధోనీ.. 110 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. 2016, 2020 తప్ప ప్రతి సీజన్​లో ధోనీ చెన్నై జట్టును ప్లేఆఫ్స్​కు తీసుకువెళ్లాడు. ఇతడి విజయశాతం 58.8గా ఉంది.

IPL 2022
ఎంఎస్​ ధోనీ

కామెరూన్​ వైట్​

Cameron White: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరూన్ వైట్..​ ఐపీఎల్​లో ఆర్సీబీ, దక్కన్ ఛార్జర్స్​, సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్లకు కెప్టెన్​గా వ్యవహరించాడు. 2012 సీజన్​ మధ్యలో సంగక్కర నుంచి దక్కన్ ఛార్జర్స్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది సన్​రైజర్స్​కూ కెప్టెన్​గా చేశాడు. మొత్తంగా 12 మ్యాచ్​లకు సారథ్యం వహించిన వైట్​.. 7 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.33గా ఉంది.

IPL 2022
కామెరూన్​ వైట్​

ఇవీ చూడండి:

IPL 2022: ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​లు పట్టింది వీరే..

ఐపీఎల్​లో అత్యధికసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' వీరికే..

IPL 2022: వీరి ఆట చూసి తీరాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.