Shreyas Iyer RCB: ఐపీఎల్లో తమ జట్టు కెప్టెన్‌గా టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్‌ను నియమించుకోవాలని భావిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మేరకు ఆర్సీబీ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్న వర్గాలు వెల్లడించాయి.
"సారథిగా విరాట్ కోహ్లీ వైదొలిగిన అనంతరం.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా తీసుకోవాలని ఆర్సీబీ చాలా ఆసక్తిగా ఉంది. ఫిబ్రవరిలో జరగనున్న వేలంలో అతడి కోసం తీవ్రంగా బిడ్డింగ్ చేయనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ కూడా అతడిని దక్కించుకోవాలని చూస్తున్నాయి." అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక శ్రేయస్ కూడా.. తను ఏ జట్టుకు ఆడినా కెప్టెన్‌గానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ క్యాపిటల్స్.. రిషభ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు స్పష్టంచేసిన తర్వాత ఆ జట్టును విడిచిపెట్టాడు శ్రేయస్. అనంతరం లఖ్‌నవూ, అహ్మదాబాద్ జట్లు కెప్టెన్సీని ఆఫర్ చేయకపోవడం వల్ల వాటిలోనూ చేరలేదు.
ఇదీ చూడండి: Ravindra Jadeja CSK: సీఎస్కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా..!