IPL 2022: క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. మే 29న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. మే 29న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
ఈ సీజన్లో మొత్తం 12 డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు జరుగుతుండగా దిల్లీ, ముంబయి మధ్య తొలి డబుల్ హెడ్డర్ జరగనుంది. రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా... సాయంత్రం మ్యాచ్‌లు 3:30 నిమిషాలకు మొదలవుతాయి. 65 రోజుల పాటు సాగే సీజన్లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లో చివరి మ్యాచ్ వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది.
ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.
ఇదీ చదవండి: జడ్డూ ఆల్‌రౌండ్ షో... లంకపై భారత్ ఘన విజయం