ETV Bharat / sports

ముంబయికి షాక్​.. రోహిత్‌ శర్మకు భారీ జరిమానా - ముంబయి ఇండియన్స్ న్యూస్​

IPL 2022 Rohit Sharma: ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మకు భారీ జరిమానా పడింది. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్​ నిర్వాహకులు వెల్లడించారు.

IPL 2022 news
Rohit Sharma news
author img

By

Published : Mar 28, 2022, 10:13 AM IST

IPL 2022 Rohit Sharma: ఐపీఎల్​ మెగా టీ20 టోర్నీలో భాగంగా దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా పడిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు.

ఆదివారం జరిగిన ఈ పోరులో తొలుత ముంబయి టాస్‌ ఓడి బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 177/5 స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (81; 48 బంతుల్లో 11x4, 2x6) దంచికొట్టాడు. అనంతరం దిల్లీ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లలిత్‌ యాదవ్‌ (48 నాటౌట్‌; 38 బంతుల్లో 4x4, 2x6), అక్షర్‌ పటేల్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 2x4, 3x6) చివర్లో బౌండరీల మోత మోగించి విజయాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో నిర్దిష్ట సమయంలోపు ముంబయి బౌలింగ్‌ కోటా పూర్తిచేయకపోవడం వల్ల ఈ జరిమానా విధించారు.

ఏ మ్యాచైనా గెలవాలనుకుంటాం: ఇక మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. తమ ప్రణాళికల ప్రకారం బౌలింగ్‌ చేయలేకపోయామని చెప్పాడు. "మేం సాధించిన స్కోర్‌ చాలా మంచిదని అనుకున్నా. ఈ పిచ్‌పై 170కి పైగా పరుగులు వస్తాయని ముందు అనిపించలేదు. కానీ, మా బ్యాటర్​ బాగా ఆడి ఘనంగా ముగించారు. అయితే, మేం ప్రణాళికలకు తగ్గట్టు బౌలింగ్‌ చేయలేకపోయాం. అలాగే కచ్చితంగా తొలి గేమ్‌ని గెలవాలని మేం ఎప్పుడూ పట్టుపట్టలేదు. ఏ మ్యాచ్‌కైనా పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతాం. అది తొలి మ్యాచ్‌ అయినా.. ఆఖరి మ్యాచ్‌ అయినా ఒకేలా ప్రిపేర్‌ అవుతాం. ప్రతి మ్యాచ్‌ గెలవాలనుకుంటాం. పరిస్థితులు కలిసిరాలేదు. ఈ విజయంతో నిరాశ చెందినా ఇదే అంతిమం కాదు" అని ముంబయి కెప్టెన్‌ అన్నాడు.

ఇదీ చదవండి: IPL 2022: ముంబయిపై ఘనవిజయం సాధించిన దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.